Viral video: నోట్లో సిగార్.. చేతిలో విధ్వంసకర బాంబ్.. అతని కూల్ యాటిట్యూడ్ మీరూ చూడాల్సిందే..

Viral video: ఉక్రెయిన్(Russia Ukraine War) లో తాజా పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఆ దేశ ప్రెసిడెంట్ వెనుకుండి రష్యా దాడులకు ఏ మాత్రం బయపడకుండా తమ దేశ పౌరులను, సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. తాజాగా అక్కడికి చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.

Viral video: నోట్లో సిగార్.. చేతిలో విధ్వంసకర బాంబ్.. అతని కూల్ యాటిట్యూడ్ మీరూ చూడాల్సిందే..
Ukrainian With Bomb
Follow us

|

Updated on: Feb 28, 2022 | 12:47 PM

Viral video: ఉక్రెయిన్(Russia Ukraine War) లో తాజా పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఆ దేశ ప్రెసిడెంట్ Volodymyr Zelenskyy  రష్యా దాడులకు ఏ మాత్రం బయపడకుండా తమ దేశ పౌరులను, సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీనికి తోడు రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రజలు కదనరంగంలోకి వచ్చి పోరాడుతున్న తీరును వైరల్ అవుతున్న అనేక ఇంటర్నెట్ కథనాల్లో మనం చూస్తూనే ఉన్నాం. దీని కారణంగా వందలాది మంది అమాయకపు ఉక్రేనియన్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో తన గుండె దైర్యాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి సంబంధించి మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

సాధారణంగా దీపావళి టపాకాయలనే మనం చాలా జాగ్రత్తగా పేల్చాలని సూచనలు వింటూ ఉంటాం. అదే నిజమైన బాంబు మన చేతిలో ఉంటే.. ఇక అంతే సంగతులు. కానీ తాజాగా.. ఓ ఉక్రేనియన్ వ్యక్తి రష్యన్ సేనలు రోడ్డుపై అమర్చిన ల్యాండ్ మైన్ ను చేతులతో పట్టుకుని సిగరెట్ కాల్చుకుంటూ దగ్గరలోని ఖాళీ ప్రదేశానికి దానిని క్యాజువల్ గా నడుచుకుంటూ తీసుకెళుతున్న దృశ్యం అందరినీ ఆర్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్నెట్ లో అనేక పాత వీడియోలు ఇలాంటి సమయంలో హల్ చెల్ చేస్తుంటాయి.. కానీ ఈ వీడియో చూస్తుంటే తాజాదేనని అనిపిస్తోంది. ఇదే వీడియోను గతంలో పోస్టు చేసినట్లు ఎటువంటి ఆధారాలు, ఆనవాళ్లు ఇప్పటి వరకూ లభించలేదు.

ఈ వీడియోలో చూపినది ఒక యాంటీట్యాంక్ మిసైల్ అని తెలుస్తోంది. ఇది గనుక ఒకవేళ పేలితే భారీ విధ్వంసం తప్పదని తెలుస్తోంది. ఏదేమైన అతని తెగువకు నెటిజన్లు ఫిలా అవుతున్నారు. బవిశా అతడు దానిని మాస్కోకు తీసుకెళ్లేలా ఉన్నాడు చూస్తుంటే..

ఇవీ చదవండి..

ePAN: ఆధార్ కార్డ్ వినియోగించి నిమిషాల్లో పాన్ కార్డు పొందడానికి ఇలా చేయండి..

EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..

Latest Articles