AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగు పాము తోక పట్టుకుని బ్రేక్ డ్యాన్స్ చేసిన యువకుడు.. పాముకి కాటేసే మూడ్ లేనట్లుందంటున్న నెటిజన్లు..

వీడియోలో ఒక యువకుడు నిర్భయంగా నాగు పాము తోకని పట్టుకుని.. దానిని తిప్పుతూ డ్యాన్స్ చేయిస్తూ దానితో పాటు తాను కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత దాని తోకని వదిలి.. ఎదురుగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు పాము ఆ యువకుడిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు చాకచక్యంగా తప్పుకుని మళ్ళీ డ్యాన్స్ చేశాడు.

Viral Video: నాగు పాము తోక పట్టుకుని బ్రేక్ డ్యాన్స్ చేసిన యువకుడు.. పాముకి కాటేసే మూడ్ లేనట్లుందంటున్న నెటిజన్లు..
King Cobra Stuns Video
Surya Kala
|

Updated on: Oct 13, 2023 | 11:34 AM

Share

నెట్టింట్లో రోజు రోజుకీ రకరకాల వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. కొన్ని వీడియోలు వైరల్ అవుతూ నెటిజన్లను కట్టుకుంటే.. మరికొన్ని వీడియాలు భయబ్రాంతులకు గురి చేసేవిగా ఉంటాయి. కోతులను, కుక్కలను పట్టుకుని ఆడించే యువతీ యువకులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉండి ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొందరు పాములకు దాహాన్ని తీరుస్తూ లేదా వాటిని రక్షించి సురక్షితంగా విడిచి పెట్టె వీడియోలు కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పాముకి సంబంధించిన వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక యువకుడు అత్యంత విషం కలిగిన పాము తోక పట్టుకుని డ్యాన్స్ చేయిస్తూ తాను దాని ముందు కుప్పి గంతులు వేస్తున్నాడు.

కొందరు పాము అంటే చాలు.. అవి ఎలాంటి అయినా భయంతో వీలైనంత దూరంగా పారిపోతారు. మరికొందరు విషపూరితమైన పాముని కూడా పట్టుకుని ఆడిస్తారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక భయంకరమైన కింగ్ కోబ్రా తోక పట్టుకుని యువకుడు ఒక రకమైన డ్యాన్స్ చేస్తూ.. ఆ పాముని చేయిస్తున్నాడు. ప్రసుత్తం నెట్టింట్లో ఈ వీడియో ఒకరకమైన చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక యువకుడు నిర్భయంగా నాగు పాము తోకని పట్టుకుని.. దానిని తిప్పుతూ డ్యాన్స్ చేయిస్తూ దానితో పాటు తాను కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత దాని తోకని వదిలి.. ఎదురుగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు పాము ఆ యువకుడిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు చాకచక్యంగా తప్పుకుని మళ్ళీ డ్యాన్స్ చేశాడు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు యువకుడు అసాధారణ ధైర్యసాహసాలను  ప్రశంసిస్తే మరికొందరు అతని చర్యని తప్పు పడుతూ ప్రాణం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం అని అంటున్నారు.  ఒక నెటిజన్ హాస్యాస్పదంగా స్పందిస్తూ..  “నాగుపాముకి ఈరోజు డ్యాన్స్ చేసే మూడ్‌  లేదు'” అని వ్యాఖ్యానించాడు. మరొక వ్యక్తి “ఒక దాడి, అది మీ జీవితానికి ముగింపు కావచ్చు” అని పేర్కొంటూ హెచ్చరికను జారీ చేశాడు. ఇటువంటి ప్రవర్తనకు యువత స్వస్తి పలకాలి, దయచేసి ఇలా  మళ్లీ ప్రయత్నించవద్దని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు తమకు నాగు పాము పట్ల ఆ యువకుడి ప్రవర్తన చూస్తే బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..