ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం ఏదో తెలుసా..? భారతదేశంలో గోల్డ్‌ నిల్వలు తెలిస్తే..!

అవసరమైన ఇతర దేశాలకు రుణాలు ఇవ్వడానికి కూడా చైనా ప్రసిద్ధి చెందింది. ఇక ఏడవ స్థానంలో స్విట్జర్లాండ్‌ నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటి. విదేశీయులకు అధిక జీవన వ్యయం కూడా ఉంది. ఇది జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌లో 1040.00 టన్నుల బంగారు నిల్వను కలిగి ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం ఏదో తెలుసా..? భారతదేశంలో గోల్డ్‌ నిల్వలు తెలిస్తే..!
Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 13, 2023 | 3:22 PM

ప్రాచీన భారతదేశం క్రీ.పూ. 3000 నుండి క్రీ.శ. 10వ శతాబ్దం వరకు భారతదేశాన్ని గోల్డెన్ స్పారో అని పిలిచే కాలం. ఈ యుగం మౌర్య, శుంగ, కుషాన్, గుప్తా మొదలైన అనేక ప్రసిద్ధ రాజవంశీకులు పాలించిన కాలం. వీరి కాలంలో భారతదేశాన్ని ‘సోనే కి చిడియా’ అని పిలిచే వారు. కానీ ఈరోజు బంగారం నిల్వలు ఉన్న దేశాల టాప్ 5 లిస్ట్‌కు ఎంతో దూరంలో ఉంది భారత్‌. మన దేశంలో బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ప్రపంచంలో భారత్‌ కంటే ఎక్కువ బంగారం ఉన్న దేశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. స్వర్ణం ఉన్న దేశాల జాబితాలో, భారతదేశం మొదటి ఐదు దేశాలలో కూడా స్థానం పొందలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మాంద్యం భయాలతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ సమయాల్లో ఉపయోగపడే పెట్టుబడిగా అన్ని దేశాలు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా వద్ద 8133 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

జర్మనీ రెండవ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. జర్మనీలో 3359 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక, ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇటలీలో 2451.84 MT బంగారం ఉంది. చారిత్రాత్మకంగా, ఇటలీ రాజులు, చక్రవర్తులు తమ బంగారు ఖజానాను దోపిడీలు, దాడుల ద్వారా భారీగా పెంచుకున్నారు. ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఫ్రాన్స్ వద్ద 2436.35 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఒకప్పుడు ఫ్రాన్స్ ప్రపంచం మొత్తాన్ని శాసించేది.

ఇవి కూడా చదవండి

Gold అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో రష్యా ఐదవ స్థానంలో ఉంది. రష్యాలో 2298.53 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఆరో స్థానంలో చైనా ఉంది. చైనా వద్ద 2068.36టన్నుల బంగారం నిల్వ ఉంది. అవసరమైన ఇతర దేశాలకు రుణాలు ఇవ్వడానికి కూడా చైనా ప్రసిద్ధి చెందింది. ఇక ఏడవ స్థానంలో స్విట్జర్లాండ్‌ నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటి. విదేశీయులకు అధిక జీవన వ్యయం కూడా ఉంది. ఇది జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌లో 1040.00 టన్నుల బంగారు నిల్వను కలిగి ఉంది.

జపాన్‌ తన బంగారు నిల్వలో 846 టన్నుల బంగారంతో జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. దేశం దాని పరిశుభ్రత, ప్రవర్తనకు కూడా ప్రసిద్ధి చెందింది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ దాని బంగారు నిల్వలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంది.

ఈ జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. భారత్‌లో 743.83 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పురాతనకాలంలో బంగారపు పక్షి అని కూడా పిలువబడే భారతదేశంఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే చరిత్రలో ఒకప్పుడు భారత్‌లో అత్యధికంగా బంగారం నిల్వలు ఉండేవి. అంతేకాదు.. భారత దేశం ఇప్పటికీ పుత్తడిపై అత్యంత ప్రియం కలిగినదిగా గుర్తింపు ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..