AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:వామ్మో..ఇలాంటి బస్సు సీటు కోసమా…రోజూ మన పోరాటం..? ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వీడియో చూసిన ప్రతి ఒక్కరు తీవ్రంగా స్పందించారు. అయిదు నిముషాల ప్రయాణమే అయినా బస్సు దిగిన తర్వాత తప్పక స్నానం చేయాలి అని ఒకరు అన్నారు. బస్సు దిగిన తర్వాత నా బట్టలు నీళ్లలో నానబెట్టుకుంటానని మరొకరు చెప్పారు. నేను నా జీవితమంతా ప్రజా రవాణాలోనే గడిపాను, కాబట్టి నా శరీరంలోకి ఎంత దుమ్ము ప్రేశించిందోనని మరొకరు వాపోయారు.

Viral Video:వామ్మో..ఇలాంటి బస్సు సీటు కోసమా...రోజూ మన పోరాటం..? ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Dust In Bus Seat
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2023 | 4:37 PM

Share

ఇళ్లలో బెడ్లు, సోఫాను శుభ్రం చేయటం సర్వసాధారణం. మనం వాటిని ఎంత బలంగా దులిపితే.. అంత దుమ్మ, దూళి రేణువులు పైకి లేస్తుంటాయి. కానీ, దుమ్ము సులభంగా కనిపించదు. మూలలు, ఇరుకైన ప్రదేశాల్లో దుమ్ము,దూళి పేరుకుపోయి ఉంటుంది. బలంగా దులిపినా కొద్ది వాటిల్లోంచి డస్ట్‌ బయటకు వస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బస్సులోనిసీటు పగిలిపోవడంతో దుమ్ము రేగడం చూస్తుంటే.. ఎవరికైనా అసహ్యం కలిగిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత మొత్తంలో దుమ్ము మన శరీరంలోకి చేరుతుందా..? అని భయపడుతున్నారు. బస్ సీట్లు సాధారణంగా రెగ్జిన్‌తో తయారు చేస్తారు. రోడ్ల మీద దుమ్ము దాగడం మామూలే. అయితే ఇంత దుమ్ము దాగి ఉందా..అనే సందేహం కలుగుతుంది..?

ఈ వీడియో @_likealeaf ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 21 మిలియన్ల మంది వీక్షించారు. లక్ష మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది స్పందించారు. ఇది నిజంగా భయానకంగా ఉందని ఇలాంటి సీటు కోసమా..? మేము ప్రతిరోజూ పోట్లాడేది అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తీవ్రంగా స్పందించారు. అయిదు నిముషాల ప్రయాణమే అయినా బస్సు దిగిన తర్వాత తప్పక స్నానం చేయాలి అని ఒకరు అన్నారు. బస్సు దిగిన తర్వాత నా బట్టలు నీళ్లలో నానబెట్టుకుంటానని మరొకరు చెప్పారు. నేను నా జీవితమంతా ప్రజా రవాణాలోనే గడిపాను, కాబట్టి నా శరీరంలోకి ఎంత దుమ్ము ప్రేశించిందోనని మరొకరు వాపోయారు.

బస్సు, రైలులో ప్రయాణించిన తర్వాత ప్యాంటు, షర్టులు ఉతకాలని మరొకరు చెప్పారు. వారానికోసారి బస్సులు కొట్టుకుపోవడానికి ఇదే కారణమని మరొకరు అన్నారు. వామ్మో ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు తప్పనిసరిగా బస్సు ప్రయాణం గురించి ఆలోచించాల్సి అవసరం ఉందని మరి కొందరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..