Snake: పామును బతికించేందుకు నానా కష్టాలు.. మెరుగైన వైద్యం కోసం ఏకంగా ఢిల్లీకి..!

Snake: పామును బతికించేందుకు నానా కష్టాలు.. మెరుగైన వైద్యం కోసం ఏకంగా ఢిల్లీకి..!

Anil kumar poka

|

Updated on: Oct 13, 2023 | 4:56 PM

పామును చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. పాము కాటుకు చనిపోవటం లేదా కాటు తర్వాత ఆస్పత్రికి పరిగెత్తటం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం నాగు పామును కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు పడిన కష్టం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. గాయపడిన ఓ పాముకు చికిత్స చేయించేందుకు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

పామును చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. పాము కాటుకు చనిపోవటం లేదా కాటు తర్వాత ఆస్పత్రికి పరిగెత్తటం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం నాగు పామును కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు పడిన కష్టం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. గాయపడిన ఓ పాముకు చికిత్స చేయించేందుకు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బదౌన్‌ జిల్లాలోని ఓ హార్డ్‌వేర్ షాప్‌లోకి ఒక నాగు పాము చొరబడింది. అయితే అది గమనించని ఆ దుకాణంలోని వ్యక్తి తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒక భారీ ఇనుప వస్తువును తీయడానికి ప్రయత్నిస్తుండగా.. అతని కంటికి ఒక నాగు పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ వ్యక్తి ఆ ఇనుప వస్తువును కింద పడేశాడు. దీంతో ఆ వస్తువు కాస్త ఆ నాగు పాముపై పడింది. ఈ ఘటనలో ఆ నాగు పాముకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ.. హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఆ నాగు పామును చూసి చలించిపోయాడు. వెంటనే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి సమాచారం అందించాడు. నాగుపాము పరిస్థితి గురించి పూర్తిగా ఆమెకు వివరించాడు. దీంతో ఆ నాగు పామును ఢిల్లీకి తీసుకురావాలని దానికి మెరుగైన చికిత్స అందించాలని మేనకా గాంధీ సూచించారు. ఈ క్రమంలోనే వికేంద్ర శర్మ.. ఆ నాగు పామును అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ పాముకు ఎస్‌ఓఎస్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..