Mumbai: ఆగండ్రా.. డోర్ తెరవనివ్వండిరా..! లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికుల ఇక్కట్లు..
సోషల్ మీడియా పుణ్యమా అని ఢిల్లీ మెట్రో, ముంబయి లోకల్ ట్రైన్‌లో పలువురు యువతీ యువకులు చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌కి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రయాణికులు ట్రైన్ ఆటోమేటిక్ డోర్ తెరుచుకోకముందే లోపలికి వెళ్లడానికి పెద్ద రిస్కే చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా పుణ్యమా అని ఢిల్లీ మెట్రో, ముంబయి లోకల్ ట్రైన్‌లో పలువురు యువతీ యువకులు చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌కి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రయాణికులు ట్రైన్ ఆటోమేటిక్ డోర్ తెరుచుకోకముందే లోపలికి వెళ్లడానికి పెద్ద రిస్కే చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ముంబై స్టేషన్‌లో రైలు ఆగగానే జనం తలుపులు తట్టడం మొదలుపెట్టారు. కొంచెం ఓపెన్ కాగానే డోర్ లోపల చేయి పెట్టి బలవంతంగా తలుపును తెరిచారు. సగం కూడా ఓపెన్ కాని డోర్‌నుంచి ప్రయాణికులు ఎగబడి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఆ కొంచెం గ్యాప్‌నుంచి అతి కష్టంమీద లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో వారి బాడీలోని పార్ట్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అయినా వారు అదేమీ పట్టించుకోకుండా రైలు ఎక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి వైరల్ కావడంతో ఓ వైపు బాధితులు, మరోవైపు నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఇలా రైల్లోకి దూసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని కొందరు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించాలని మరికొందరు అంటున్నారు. ట్రైన్ ఎక్కే క్రమంలోనే పడి లేస్తూ,.. మనుషుల మధ్య ఒత్తిడి కారణంగా శరీరంలో అవయవాలు దెబ్బతింటున్నాయని, చాలా మందికి వెన్ను, కడుపు నొప్పి వస్తుందని కొందరు బాధితులు స్పందించారు. ముంబయిలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్య ఇది అంటున్నారు మరికొందరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..