Cobra in Shoe: మహిళ షూలో నక్కిన నాగుపాము.. ఆ షూ తీయగానే బుసలు కొడుతూ లేచిన స్నేక్..!

Cobra in Shoe: మహిళ షూలో నక్కిన నాగుపాము.. ఆ షూ తీయగానే బుసలు కొడుతూ లేచిన స్నేక్..!

Anil kumar poka

|

Updated on: Oct 16, 2023 | 11:23 AM

ఇటీవల పాములు వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా ఓ మహిళ బయటకు వెళ్లడానికి షూ వేసుకుందామనుకుంది. తీరా షూ తీసి చూసేసరికి అందులో నాగుపాము దర్శనమిచ్చింది. దెబ్బకు షాక్‌ తిన్న ఆ మహిళ అక్కడినుంచి లగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల పాములు వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా ఓ మహిళ బయటకు వెళ్లడానికి షూ వేసుకుందామనుకుంది. తీరా షూ తీసి చూసేసరికి అందులో నాగుపాము దర్శనమిచ్చింది. దెబ్బకు షాక్‌ తిన్న ఆ మహిళ అక్కడినుంచి లగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను ప్రముఖ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నందా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ షూలో చిన్న నాగుపాము దాక్కుని ఉంది. షూని కదిలించగానే అది బయటకు వచ్చి బుసలు కొట్టింది. ఆ తర్వాత కాసేపటికి నాగు పాము బయటకు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ..కోబ్రా కొత్త షూని ట్రై చేస్తోంది అంటూ సుశాంత్ నందా ఆశ్చర్యం పలికించే ఎమోజీలతో పోస్ట్ చేశారు. జోక్ లను పక్కన పెట్టండి. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు. వేసుకునే వస్త్రాలు, గొడుగును సైతం ఈ కాలంలో చెక్ చేసుకోవాలంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 13, 2023 05:21 PM