Snow fall: కశ్మీర్‌లో భారీ హిమపాతం.. అతి మంచు వల్ల సోనామార్గ్ మూసివేత.!

Snow fall: కశ్మీర్‌లో భారీ హిమపాతం.. అతి మంచు వల్ల సోనామార్గ్ మూసివేత.!

Anil kumar poka

|

Updated on: Oct 13, 2023 | 5:33 PM

కశ్మీర్‌ లోయలో భారీగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతంతో కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. సెంట్రల్ కశ్మీర్‌ లోని గందర్‌బాల్ జిల్లాలో జోజిలా ఎగువ ప్రాంతాలు హిమపాతంతో మునిగిపోయాయి. భారీగా మంచు కురుస్తుండటంతో సోనామార్గ్‌-జోజిలా రహదారిని అధికారులు మూసివేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌ లోని లాహౌల్‌ – స్పితి ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది.

కశ్మీర్‌ లోయలో భారీగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతంతో కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. సెంట్రల్ కశ్మీర్‌ లోని గందర్‌బాల్ జిల్లాలో జోజిలా ఎగువ ప్రాంతాలు హిమపాతంతో మునిగిపోయాయి. భారీగా మంచు కురుస్తుండటంతో సోనామార్గ్‌-జోజిలా రహదారిని అధికారులు మూసివేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌ లోని లాహౌల్‌ – స్పితి ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కనుచూపు మేర శ్వేత వర్ణం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్‌ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచే గాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. అయితే, శీతాకాలం ప్రారంభంలోనే జమ్ముకాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..