AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: అత్యంత ఖరీదైన ఫెరారీ కార్ పై వీధి కుక్క.. హైదరాబాద్ మ్యాన్ దయాగుణం!

సాధారణంగా మనం ఒక కుక్క కనిపిస్తే తరిమేస్తాం. ఇంట్లో పెట్ డాగ్స్ తప్పించి ఏ ఇతర జంతువులు ఇంట్లోకి వచ్చినా.. మనకు సంబంధించిన వాటిని పాడు చేసినా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ముందు దాన్ని తరిమేస్తాం. లేదంటే కొట్టడానికి కూడా సిద్ధ పడతారు. కానీ ఇతను మాత్రం తన సూపర్ లగ్జరీ కార్ లో కుక్కు ప్లేస్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు జంతు ప్రేమికులు సంతోషించడంతో పాటు..

Video Viral: అత్యంత ఖరీదైన ఫెరారీ కార్ పై వీధి కుక్క.. హైదరాబాద్ మ్యాన్ దయాగుణం!
viral news
Chinni Enni
|

Updated on: Oct 13, 2023 | 4:26 PM

Share

సాధారణంగా మనం ఒక కుక్క కనిపిస్తే తరిమేస్తాం. ఇంట్లో పెట్ డాగ్స్ తప్పించి ఏ ఇతర జంతువులు ఇంట్లోకి వచ్చినా.. మనకు సంబంధించిన వాటిని పాడు చేసినా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ముందు దాన్ని తరిమేస్తాం. లేదంటే కొట్టడానికి కూడా సిద్ధ పడతారు. కానీ ఇతను మాత్రం తన సూపర్ లగ్జరీ కార్ లో కుక్కు ప్లేస్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు జంతు ప్రేమికులు సంతోషించడంతో పాటు వీడియో షేర్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్తా నెట్టింగ జోరుగా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఈ వీడియో ఏంటి? ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అమీర్ శర్మ ఇటీవల తన ఫెరారీ కార్ పైన ఓ కుక్క హాయిగా కూర్చోవడాన్ని గమనించారు. వెంటనే దాన్ని తరిమేయకుండా.. బుజ్జగిస్తూ చేతితో నిమురుతా దగ్గరకు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

View this post on Instagram

A post shared by Aamir Sharma (@aamirsharma)

అంతే కాకుండా.. ‘నా ఫెరారీ కార్ కవర్ వీధి కుక్కలకు మంచంలాగా అయ్యింది. ఈ కుక్క గాయాలతో మా దగ్గరకి వచ్చిన వీధి కుక్క అని.. మేము దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని’ అంటూ రాసుకొచ్చారు. అలాగే తమ ఇల్లు, గ్యారేజీలో ఇతర వీధి కుక్కలకు కూడా అనుమతించినట్లు చెప్పారు.

కాగా ఈ వీడియో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే అర మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కప్పబడిన ఫెరారీ కార్ కవర్ పై కుక్క కూర్చున్నట్లు వీడియోలో ఉంది. శర్మ దాన్ని పలకరించిన వెంటనే.. అది కూడా ఆనందంతో తోక ఊపుతూ పలకరిస్తూ దిగింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హైదరాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అమీర్ శర్మను అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తున్నారు. ‘కుక్కలపై మీ కున్న మమకారం అద్భుతం’అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వీధి కుక్కల పట్ల మీ ప్రేమను చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని మరొక నెటిజన్ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..