AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన దారిన తాను పోతుంటే కోబ్రాను కెలికారు.. కట్ చేస్తే..

పాములంటే అందరికీ భయమే. అలాంటిది ఇంటి ఆవరణలో ఓ పెద్ద నాగు పాము కనిపిస్తే ఏంచేస్తారు. భయంతో పరుగులు తీస్తారు. కాస్త ధైర్యం ఉన్నవారైతే దానిని ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఏదైనా జరగొచ్చు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తన దారిన తాను పోతుంటే కోబ్రాను కెలికారు.. కట్ చేస్తే..
Snake
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2024 | 8:27 PM

Share

వైరల్‌గా మారిన వీడియోలో ఓ చిన్న వీధిలో అటు ఇటూ ఇళ్లు ఉన్నాయి. మద్యలో చిన్న రోడ్డు ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో ఆ వీధిలోకి ఓ పెద్ద నాగుపాము వచ్చింది. అది నల్లగా మెరుస్తూ చాలా పెద్దగా ఉంది. ఆ పామును చూసిన ఓ మహిళ అదెక్కడ తమ ఇళ్లలోకి చొరబడుతుందోనని భయపడి, ఓ పెద్ద కర్ర తీసుకొని దానిని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో తన దారిన తాను పోతున్న ఆ నాగుపాము ఒక్కసారిగా మహిళ వైపు తిరిగి, నా మానాన నేను పోతుంటే నన్ను బెదిరిస్తావా.. నేను నీ ఇంట్లోకి అయితే రాలేదు కదా.. ఉండు నీపని చెప్తాను అన్నట్టుగా ఆ మహిళ వైపు వెళ్లసాగింది. ఇంతలో పక్కన ఇంట్లోంచి మరో మహిళ కర్రతీసుకొని వచ్చింది. ఈ వైపునుంచి ఈ మహిళ కూడా పామును బెదిరించడం మొదలు పెట్టింది.

ఇద్దరు మహిళలూ చెరోవైపున కర్రతో నేలపై కొడుతూ ఆ పామును బెదిరించారు. ఇలా రెండు వైపులా మహిళలు కర్రతో చప్పుడు చేస్తుండడంతో.. నా జోలికి వచ్చారో జాగ్రత్త అన్నట్టుగా .. పాము పడగ విప్పి వారిపై బుసలు కొట్టింది . ఈ వీడియో ఇంతటితో ముగిసింది. తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు. అయితే ఈ ఘటనను అక్కడున్నవారెరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దారిన వెళ్లే పామును ఇంట్లోకి పిలవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వారు నాగుపామును బాధపెట్టాలని అనుకోలేదు.. వేరే ఇంట్లోకి వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షమందికి పైగా వీక్షించారు. వెయ్యిమందికి పైగా లైక్‌ చేశారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి 

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?