AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అన్నయ్య పెళ్లికి చెల్లెమ్మ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పట్టలేని సంతోషంలో గంతులేసిన తల్లిదండ్రులు..

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ఉపాధి కోసమే, విద్య కోసమే.. ఇలా వలస వెళ్తూనే ఉన్నారు. అయితే, ఒకసారి అక్కడికి వెళ్లాక..

Viral: అన్నయ్య పెళ్లికి చెల్లెమ్మ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పట్టలేని సంతోషంలో గంతులేసిన తల్లిదండ్రులు..
Woman Surprised Family
Shiva Prajapati
|

Updated on: Jan 24, 2023 | 7:26 PM

Share

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ఉపాధి కోసమే, విద్య కోసమే.. ఇలా వలస వెళ్తూనే ఉన్నారు. అయితే, ఒకసారి అక్కడికి వెళ్లాక.. తిరిగి రావాలంటే చాలా ప్రయాసకోడ్చాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారు అయితే, సెలవులు దొరక్కపోవడం, సమయానికి టికెట్లు దొరక్కపోవడం వల్ల రాలేకపోతుంటారు. ముఖ్యంగా ఇండియాలో తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి కూడా అందుకోలేని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఓ మహిళ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. యూకే వెళ్లిన ఆమె.. ఇండియాలో తన సోదరుడిని పెళ్లికి వెళ్లలేకపోతున్నందుకు చాలా బాధపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. కానీ, చివరకు ఆమె బాధ కాస్తా సంతోషంగా మారింది. ఆ సంతోషం కుటుంబమంతా చిగురించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన దేశానికి చెందిన ఓ మహిళ యూకేకి వెళ్లింది. ఆమె కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల ఆమె సోదరుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి తేదీ నాటికి ఆమె ఇండియాకు వద్దామని ప్లాన్ వేసుకుంది. కానీ, దురదృష్టావశాత్తు ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దాంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందింది. తన సోదరుడి పెళ్లికి రాలేనేమో అని వాపోయింది.

ఇవి కూడా చదవండి

కానీ, తగ్గేదేలే అన్నట్లుగా.. చివరి వరకు ప్రయత్నించింది. ఆమె టైమ్ బాగుంది.. ఒక ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. నేరుగా వచ్చి సర్‌ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యింది. ఇంకేముంది.. అనుకున్నట్లుగానే.. యూకే నుంచి ఇండియాలో ల్యాండ్ అయ్యింది. నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లింది. పెళ్లిలో కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా.. ఆమె తల్లిదండ్రుల రియాక్షన్ అయితే అద్భుతం అనాలి. చాలా కాలం తరువాత కూతురిని చూడటంతో.. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. మహిళ తల్లి అయితే ఎగిరి గంతేసింది. తండ్రి కూడా ఆమెను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. చిందులేశాడు. సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఆమె రాకతో మురిసిపోయారు.

ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ తల్లిదండ్రుల రియాక్షన్, సోదరుడి ప్రేమ వీడియోలో చూసి ఫిదా అయిపోతున్నారు. కుటుంబాన్ని మించింది ఏదీ లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ‘మీరు ఎక్కడ ఉన్నా కుటుంబానికి చాలా ముఖ్యం.. ఎలాంటి పరిస్థితిలో అయినా మీరు వారికి అండగా ఉండాలి’ అంటారు.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్