Viral Video: ఎలుగుబంటి ముందు ఆ వర్కవుట్స్ ఏంట్రా బాబు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ప్రతి రోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని హాస్యాన్ని పండిస్తాయి. మరికొన్ని అద్భుతంగా ఉంటాయి.

Viral Video: ఎలుగుబంటి ముందు ఆ వర్కవుట్స్ ఏంట్రా బాబు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
Workout
Follow us
uppula Raju

|

Updated on: Mar 10, 2022 | 8:37 AM

Viral Video: ప్రతి రోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని హాస్యాన్ని పండిస్తాయి. మరికొన్ని అద్భుతంగా ఉంటాయి. అయితే అన్నిటికన్నా జంతువులకి సంబంధించిన కంటెంట్‌ని నెటిజన్లు బాగా ఆదరిస్తారు. వీడియో నచ్చితే పదే పదే చూస్తే ఎంజాయ్ చేస్తారు. లైక్, కామెంట్స్ చేస్తారు. తాజాగా అడవిలో ఓ ఎలుగుబంటి, ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అందులో ఏముందో ఒక్కసారి తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు కూడా అడవి మధ్యలో భయంకరమైన ఎలుగుబంటి ముందు వర్కవుట్లు చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందులో కనిపిస్తున్న ఎలుగుబంటి ధృవపు ఎలుగుబంటి. దీనిని వారు తీసుకొచ్చారా లేదా అదే అక్కడికి వచ్చిందా అనేది అర్థం కావడం లేదు. ఇద్దరు వ్యక్తులు కూడా ఎలుగుబంటి ముందర ఎటువంటి భయం లేకుండా వర్కవుట్లు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా షేర్ అవుతోంది. 30 సెకన్ల క్లిప్‌లో ఒక వ్యక్తి చెట్టు కొమ్మపై పుల్-అప్‌లు చేస్తూ కనిపిస్తుండగా,, మరొక వ్యక్తి అడవి మధ్యలో బాక్సింగ్‌ చేయడం మనం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది వార్తలు రాసే సమయానికి సుమారు 30 మిలియన్ల వీక్షణలను పొందింది. దీంతో పాటు 6 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేసారు. చాలా మంది ఫన్నీ రియాక్షన్‌లను ఇస్తున్నారు. ఒక నెటిజన్ ఎలుగుబంటి భారీ స్కెచ్ వేసినట్లుంది అని చమత్కరించారు.

పెళ్లి చేసుకుంటే 2.5 లక్షల ప్రయోజనం.. కానీ అది ఇలా జరిగితేనే..!

330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!

Aadhaar: మీ ఆధార్ కార్డు సురక్షితమేనా.. సైబర్ నేరస్థులకి చిక్కొద్దంటే ఇలా చేయండి..!