AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది చూశాక కూడా పాపడ్‌లను తినే ధైర్యం చేస్తారా?… పాపడ్‌ తయారీ ఇలాగా అంటూ షాక్‌ అవుతున్న నెటిజన్స్‌

భారతీయ వంటకాల్లో పాపడ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. డైనింగ్‌ టేబుల్‌ మీద ఎన్ని రకాల కూరలు ఉన్నప్పటకీ పాపడ్‌ లేకుంటే ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. తేలికగా, క్రంచీగా ఉండే ఈ పాపడ్‌ ప్రతి భోజనానికి రుచికరమైన పంచ్‌ను జోడిస్తాయి. ఇంట్లో వండిన దాల్-చావల్ అయినా...

Viral Video: ఇది చూశాక కూడా పాపడ్‌లను తినే ధైర్యం చేస్తారా?... పాపడ్‌ తయారీ ఇలాగా అంటూ షాక్‌ అవుతున్న నెటిజన్స్‌
Papad Making Process
K Sammaiah
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 29, 2025 | 6:05 PM

Share

భారతీయ వంటకాల్లో పాపడ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. డైనింగ్‌ టేబుల్‌ మీద ఎన్ని రకాల కూరలు ఉన్నప్పటకీ పాపడ్‌ లేకుంటే ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. తేలికగా, క్రంచీగా ఉండే ఈ పాపడ్‌ ప్రతి భోజనానికి రుచికరమైన పంచ్‌ను జోడిస్తాయి. ఇంట్లో వండిన దాల్-చావల్ అయినా, రుచికరమైన పండుగ స్ప్రెడ్ అయినా, పాపడ్‌లు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. కానీ అవి ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? జూలైలో ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. పాపడ్ ప్రియులకు సాంప్రదాయకంగా చిరుతిండిని ఎలా తయారు చేస్తారో తెలియజేస్తుంది.

క్లిప్‌లో ఒక మహిళ పాపడ్‌ తయారీకి మసాలా కలిపిన పిండిని ఒక గ్లాసులో తీస్తున్నట్లు చూపిస్తుంది. తరువాత, ఆమె మందపాటి పసుపు పిండిని తలక్రిందులుగా చేసిన అల్యూమినియం మూతపై పోసి, కట్టెల స్టవ్ పైన ఉంచిన పెద్ద కంటైనర్‌ను కప్పేస్తుంది. ఆ తర్వాత, ఆ మహిళ ఒక సన్నని పాపడ్‌ పొరను బయటకు తీయడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తుంది. పాపడ్‌ పొర తగినంతగా వేడైన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి తీసివేస్తుంది. తరువాతి దశలో ఆమె ఎండలో ఒక ప్లాట్‌ఫామ్‌పై కాల్చిన పాపడ్‌ పొరలను ఎండబెడుతుంది. తద్వారా అవి సమానంగా ఆరిపోతాయి. వేడి పిండి నుండి ఏదైనా తేమను తొలగించడానికి సహాయపడుతుంది. ఆ పాపడ్‌లను నిల్వ చేయడానికి సిద్ధంగా చేస్తుంది.

పాపడ్‌లను ఎండబెట్టిన తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక చిన్న గిన్నెతో చిన్న చిన్న పాపడులుగా సున్నితంగా నొక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు పాదాలను కూడా ఉపయోగించి తొక్కుతుంది. దీని తర్వాత, పాపడ్‌లను ప్యాక్ చేయడానికి ముందు మరోసారి ఎండలో ఆరబెట్టడానికి వదిలివేస్తారు.

వీడియో చూడండి:

వైరల్ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్‌ ఎక్కువగా అసహ్యించుకుంటున్నారు. “రుచి కహా హై? (రుచి ఎక్కడ ఉంది?)” అని ఒక వినియోగదారుడు అడిగాడు. “ఆమె కాలు పెట్టే వరకు అంతా బాగానే ఉంది” అని మరొకరు పేర్కొన్నారు. “ఆజ్ సే పాపడ్ ఖానా బంద్ బజార్ సే (ఈరోజు నుండి మార్కెట్ నుండి పాపడ్లు తినడం మానేస్తాను)” అని ఒక నెటిజన్‌ పోస్టు పెట్టారు.