Viral Video: తల్లిని మించిన పోరాటయోధులెవరూ లేరూ ఈ ప్రపంచంలో.. వైరలవుతోన్న వడ్రంగి పిట్ట, పాముల ఫైట్‌

Shocking Video: కన్న బిడ్డలు కష్టంలో ఉండే తల్లి గుండె తల్లడిల్లుతుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందుకే బిడ్డలపై ప్రేమ చూపించడంలో అమ్మ తర్వాతేనని చెబుతారు. మనుషులకే కాదు మూగజీవాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అది పక్షి అయినా.. జంతువు అయినా.

Viral Video: తల్లిని మించిన పోరాటయోధులెవరూ లేరూ ఈ ప్రపంచంలో.. వైరలవుతోన్న వడ్రంగి పిట్ట, పాముల ఫైట్‌
Follow us
Basha Shek

|

Updated on: Jul 23, 2022 | 11:15 AM

Shocking Video: కన్న బిడ్డలు కష్టంలో ఉండే తల్లి గుండె తల్లడిల్లుతుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందుకే బిడ్డలపై ప్రేమ చూపించడంలో అమ్మ తర్వాతేనని చెబుతారు. మనుషులకే కాదు మూగజీవాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అది పక్షి అయినా.. జంతువు అయినా. ఈక్రమంలో ఓ ఆడ వడ్రంగి పిట్ట తన పిల్లలను విషపూరిత సర్పం నుంచి కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది. వివరాల్లోకి వెళితే పాములు పక్షుల గూళ్లలోకి చేరి వాటి పిల్లలను తినేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో కూడా ఓ విషసర్పం వడ్రంగి పిట్ట పిల్లలను తినడానికి చెట్టుపైకి వెళ్లింది. అక్కడ గూళ్లలో దాగున్న పిల్లలను తినేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి పాముతో పోరాడుతుంది. తన ముక్కుతో గుచ్చుతూ పామును గాయపరుస్తుంది. వెంటవెంటనే దాడికి పాల్పడుతుంది. పాము కూడా ఆ పక్షిని పట్టుకోవడానికి విఫలప్రయత్నం చేస్తుంది. అయితే పాము నోటికి చిక్కినట్లే చిక్కి వడ్రంగి పిట్ట తప్పించుకుంటుంది. ఇక చివరకు అలసిపోయిన పాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇలా వడ్రంగి, పాముల మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు సంబంధించిన వీడియోను planet visit అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయబడింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరలవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రపంచలో అమ్మను మించిన పోరాటయోధులెవరూ లేరు’ అంటూ కేజీఎఫ్‌ డైలాగ్‌ను గుర్తుచేస్తున్నారు. ‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది. పాముకు తగిన బుద్ధి చెప్పింది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన పాము, వడ్రంగిల హోరాహోరీ పోరుపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @planet_visit

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..