Viral Video: వెర్రి వేయి విధాలు అంటే ఇదే.. ఏకంగా రష్ గా ఉన్న బ్రిడ్జి పైనే సెలూన్ పెట్టేశాడు
సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు (Videos) చూస్తుంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని అసహనం తెప్పిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతనికి ఇంకెక్కడా...
సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు (Videos) చూస్తుంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని అసహనం తెప్పిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతనికి ఇంకెక్కడా ప్లేసే దొరకలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికాలోని (America) లాస్ ఏంజెల్స్‌లో ఓ వంతెనపై వేగంగా వాహనాలు దూసుకుపోతున్నాయి. వాహనాల రాకపోకలతో ఆ బ్రిడ్జ్ ఫుల్ రష్ గా ఉంది. అయితే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆ వాహనాలు కొద్ది దూరం వచ్చేసరికి సడన్‌గా స్లోగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ బ్రిడ్జిపై (Bridge) రోడ్డు మధ్యలో ఓ బార్బర్ ఓ వ్యక్తికి తాపీగా హెయిర్‌కట్ చేస్తూ కనిపించాడు. అతడి పక్క నుంచి కార్లు దూసుకెళ్తున్నా అతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన పనిలో నిమగ్నమైపోయాడు.
Man gets haircut in the middle of the 6th Street Bridge in Boyle Heights pic.twitter.com/20d8jzZAeC
ఇవి కూడా చదవండి— Boyle Heights (@boyle_hts) July 21, 2022
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ‘బాయిల్ హైట్స్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లో రెండు వారాల క్రితం ఓ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపై రెండు లేన్ల మధ్యలో ఓ కుర్చీలో కస్టమర్ కూర్చొని ఉన్నాడు. బార్బర్ ప్రశాంతంగా హెయిర్‌కట్ చేస్తున్నాడు. వాహనాలు వారి దగ్గరకు రాగానే చచ్చినట్టు స్లో అవుతూ వెళ్తున్నాయి. అయితే, ఆ బార్బర్ అలా ఎందుకు చేశాడో వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..