Watch Video: చాయ్ వాలా అని తక్కువగా చూడకండి.. తన పాటలతో పిచ్చెక్కిస్తున్నాడు..

ఈ చాయ్‌వాలా పేరు విజయ్‌ భాయ్‌ పటేల్‌. ఆయన దుకాణానికి సుదూర ప్రాంతాల నుంచి టీ తాగేందుకు, అతడు పాడే కమ్మటి పాటలు వినేందుకు జనాలు భారీగా వస్తుంటారు. ఆయన మధురమైన స్వరానికి ప్రజానీకం అభిమానులుగా మారిపోయారు. టీ తయారు చేస్తూ.. మైక్‌లో మధురమైన స్వరంతో పాత పాటలు పాడుతూ ఉంటాడు.. వీటిని వినేందుకు ప్రజలు గంటల తరబడి అతడి షాపులోనే ఉండిపోతారట.

Watch Video: చాయ్ వాలా అని తక్కువగా చూడకండి.. తన పాటలతో పిచ్చెక్కిస్తున్నాడు..
Chaiwala
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:27 PM

డాలీ చాయ్‌వాలా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన తర్వాత, ఇప్పుడు సింగర్ చాయ్‌వాలా వీడియోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సూరత్‌కు చెందిన ఈ చాయ్‌వాలా వీడియోను ‘ఇన్‌స్టాగ్రామ్’లో షేర్‌ చేశారు. ఈ ‘సింగింగ్‌ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. టీ తయారు చేస్తూ పాట పాడే విజయ్‌భాయ్ పటేల్ స్టైల్‌ని ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. సూరత్‌కు చెందిన చాయ్‌వాలా టీతోనే కాకుండా తన గానంతో కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబైలోని సూరత్‌కు చెందిన ఈ చాయ్‌వాలా పేరు విజయ్‌ భాయ్‌ పటేల్‌. ఆయన దుకాణానికి సుదూర ప్రాంతాల నుంచి టీ తాగేందుకు, అతడు పాడే కమ్మటి పాటలు వినేందుకు జనాలు భారీగా వస్తుంటారు. ఆయన మధురమైన స్వరానికి ప్రజానీకం అభిమానులుగా మారిపోయారు. టీ తయారు చేస్తూ.. మైక్‌లో మధురమైన స్వరంతో పాత పాటలు పాడుతూ ఉంటాడు.. వీటిని వినేందుకు ప్రజలు గంటల తరబడి అతడి షాపులోనే ఉండిపోతారట. ఇక్కడి వచ్చే కస్టమర్స్‌..అతడు తయారు చేసే స్పెషల్‌ టీని ఆస్వాదించడమే కాకుండా, మధురమైన పాటలను కూడా వింటూ మైమర్చిపోతుంటారు. విజయ్ భాయ్ టీ చేస్తూ మైకులో పాత పాటలు పాడుతూ ఉంటాడు. విజయ్ భాయ్ పాత పాటలు పాడుతూ స్ట్రాంగ్ టీ తయారు చేస్తున్న వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

విజయ్‌ భాయ్‌ గత 20 ఏళ్లుగా సూరత్ నగరంలోని డుమాస్ ప్రాంతంలో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. అయితే గత మూడేళ్లుగా టీ చేస్తూ.. చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని ప్రొఫెషనల్ సింగర్ లాగా పాత పాటలు పాడుతూ స్ట్రాంగ్ టీ తయారు చేస్తున్నాడు. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. టీ తాగడానికి వచ్చే వ్యక్తులు ఇక్కడ కేఫ్ లాంటి అనుభూతిని పొందుతారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో 3.9 లక్షలకు పైగా వ్యూస్‌ రాబట్టింది. విజయ్‌భాయ్ టీ ఎంతో మధురంగా​ఉంటుందని, అతని గొంతు కూడా అంతే మధురంగా ఉందంటున్నారు చాలా మంది స్థానికులు, నెటిజన్లు. విజయభాయ్ భాయ్‌ టీ తాగడానికి, ఆయన పాటలు వినడానికి దూరప్రాంతాల నుంచి జనం క్యూ కడుతుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే