AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి .. నీటి ట్యాంకర్‌తో గుణపాఠం చెప్పిన అధికారులు..!

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి మున్సిపల్ అధికారులు నీటి ట్యాంకర్‌తో తగిన గుణపాఠం చెప్పారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిపై నీళ్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ చర్యను సమర్థించడమే కాకుండా ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశంసించారు. ఇది బహిరంగ మూత్ర విసర్జన చేసే వారికి మంచి గుణపాఠం అంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Viral Video: బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి .. నీటి ట్యాంకర్‌తో గుణపాఠం చెప్పిన అధికారులు..!
Public Urination
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2025 | 10:03 AM

Share

మన చుట్టుపక్కల చాలా మంది ప్రకృతి, పరిసరాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రోడ్లు, వీధుల వెంట ఎక్కడ పడితే అక్కడ చెత్తవేయటం, ఉమ్మివేయటం, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయటం వంటివి చేస్తుంటారు. అలాంటి వారికి ఎంత మంది, ఎన్ని రకాలుగా చెప్పినా ఫలితం ఉండదు.. వాళ్లలో ఉన్న నిర్లక్ష్యం, సోమరితనం, పరిశుభ్రత పట్ల అవగాహన ఏ మాత్రం పెరగదు. అలాంటివారికి మనం చెప్పే మంచి కనీసం వారి చెవుల్లోకి కూడా చేరదు.. కానీ, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పారు స్థానిక మున్సిపల్‌ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తికి మున్సిపల్‌ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు పక్కనే బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన మున్సిపల్‌ సిబ్బంది అతినికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి మున్సిపల్ అధికారులు తగిన గుణపాఠం చెప్పారు. రోడ్డు పక్కన గోడకు ఆనుకుని మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిపై నీటి ట్యాంకర్‌తో నీళ్లు కొట్టారు. పైగా ఇదంతా వీడియో రికార్డ్‌ చేశారు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్‌ చేస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇలాంటి వారికి ఇలాగే జరగాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us