AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తమ దేశానికి రావాలంటూ అందమైన అమ్మాయిల ఆహ్వానం.. బ్యూటీఫుల్‌ వీడియో వైరల్‌

అఫియా ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేసిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోకి ఏడు రోజుల్లో 15 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను 30 లక్షలకు పైగా వీక్షించారు. దీనిపై 1.21 లక్షల మంది వ్యాఖ్యానించారు. వైరల్‌ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఆకుపచ్చ, నలుపు దుస్తులు ధరించి కనిపించారు. వారి వెనకాలే ఒక పెద్ద కొండ కనిపిస్తోంది. కొంద కిందే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పైన

Viral Video: తమ దేశానికి రావాలంటూ అందమైన అమ్మాయిల ఆహ్వానం.. బ్యూటీఫుల్‌ వీడియో వైరల్‌
Pakistani Girls Invite Indi
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2025 | 2:03 PM

Share

ఇద్దరు పాకిస్థానీ అమ్మాయిలు భారత్‌ను ఆహ్వానిస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఇరువురూ భారత్‌ ప్రజలను పాకిస్థాన్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు అందమైన అమ్మాయిల భారతీయ ఆహ్వానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లక్షలాది మంది ఈ వీడియోని వీక్షించారు. పెద్ద సంఖ్యలో లైక్ చేసారు. ఈ కామెంట్లలో అనేక ఆసక్తికరమైన స్పందనలు కనిపించాయి.

అఫియా ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేసిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోకి ఏడు రోజుల్లో 15 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను 30 లక్షలకు పైగా వీక్షించారు. దీనిపై 1.21 లక్షల మంది వ్యాఖ్యానించారు. వైరల్‌ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఆకుపచ్చ, నలుపు దుస్తులు ధరించి కనిపించారు. వారి వెనకాలే ఒక పెద్ద కొండ కనిపిస్తోంది. కొంద కిందే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పైన పాకిస్థాన్ జెండా ఎగురుతోంది. ఓ అమ్మాయి ఇదంతా మొబైల్‌లో వీడియో తీస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక అమ్మాయి పాకిస్థాన్ జెండా వైపు చూపిస్తూ, భారత ప్రజలారా దయచేసి ఒక్కసారి పాకిస్థాన్‌కు రండి అని చెప్పింది. ఇలా చెప్పిన అమ్మాయి తలపై ఓ ప్రత్యేకమైన క్యాప్ పెట్టుకుంది. వీడియోలో ఆమె నవ్వుతూ కనిపించింది. ఆమె చిరునవ్వు వేల మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందించారు. వీరిలో కొందరు ఆ లోకేషన్‌ కూడా అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..