Viral Video: లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా దూసుకొచ్చిన బుల్లెట్లు… టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పాట్ డెడ్
వలేరియా మార్క్వెజ్.. టిక్ టాక్ ఫాలోవర్స్ కు పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ మెక్సికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ రక రకాల వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఈసారి తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ఉండగా...

వలేరియా మార్క్వెజ్.. టిక్ టాక్ ఫాలోవర్స్ కు పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ మెక్సికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ రక రకాల వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఈసారి తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా లైవ్‌లో ఉండగానే ఆమెపైకి తుపాకీ గుండ్లు దూసుకొచ్చాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినది.
మెక్సికన్‌లో 23 ఏళ్ల వలేరియా మార్క్వెస్ పింక్ డ్రెస్ ధరించి టిక్‌టాక్ లైవ్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. జుట్టు సరిచేసుకుని, అందరికీ హాయ్ అంటూ ఫ్యాన్స్‌తో పలకరింపులు మొదలు పెట్టింది. ఇంతలో ఆమెపైకి మూడు రౌండ్లు బుల్లెట్లు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండగానే వలేరియా ఒక పక్కకు ఒరిగిపోయిన ఘటనను చూసిన ఫాలోవర్స్ షాక్ అయ్యారు.
ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. డెలివరీ బాయ్‌గా నమ్మించి గిఫ్ట్ ఇచ్చేందుకు వలేరియా వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఆమె పేరు అడిగి మరీ ఛాతీ, తలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఎస్కేప్ అయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి:
🚨😲😲Está difícil ser influencer no México pic.twitter.com/etQxm4Ijcf
— Diego mello (@hdiegorj) May 14, 2025
