AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అది పిల్లి అనుకున్నావా బ్రో.. పులి..! ఎంతైనా నీ లక్కు బాగుంది పో

'పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అనే డైలాగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెప్పినా, ప్రెస్‌మీట్‌లో మోహన్‌బాబు చెప్పినా దానర్థం పులితో వేట ఎంత ప్రమాదకరమో చెబుతుంది. అలాంటిది ఓ ఇద్దరు వ్యక్తులు పులితో గోక్కోవడం కాదు.. ఏకంగా పులినే గోకారు. పులిముందు వాకిగ్‌ చేశారు. అంతేకాదు...

Viral Video: అది పిల్లి అనుకున్నావా బ్రో.. పులి..! ఎంతైనా నీ లక్కు బాగుంది పో
Man Touch Tiger
K Sammaiah
|

Updated on: May 16, 2025 | 9:05 PM

Share

‘పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే’ అనే డైలాగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెప్పినా, ప్రెస్‌మీట్‌లో మోహన్‌బాబు చెప్పినా దానర్థం పులితో వేట ఎంత ప్రమాదకరమో చెబుతుంది. అలాంటిది ఓ ఇద్దరు వ్యక్తులు పులితో గోక్కోవడం కాదు.. ఏకంగా పులినే గోకారు. పులిముందు వాకిగ్‌ చేశారు. అంతేకాదు దాని దగ్గరికి వెళ్లి వెనక టచ్‌ చేసి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు.

అయితే అది పులి కాదు దాని పిల్ల కావడంతో బతికిపోయారు. ఈ వీడియో క్లిప్స్‌ ఇప్పుటు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన రణథంబోర్ జాతీయ పార్క్‌లో 70కు పైగా పులులను సంరక్షిస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు రీల్స్‌ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ పులుల వద్దకు వెళ్లి టచ్‌ చేశారు. సిమెంట్‌ పైపులో ఉన్న పులి పిల్లలను ఒక వ్యక్తి చేతితో తడిమాడు. ఆ పిల్లల సమీపంలోనే ఉన్న తల్లి పులి ఆ వ్యక్తులకేసి చూస్తుంది. మరో వ్యక్తి పులి ముందు నడిచి వెళ్లి రీల్‌ కోసం ప్రయత్నించాడు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి:

ఆ వ్యక్తుల తీరుపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి