Viral Video: ఎక్కడి నుంచో వచ్చిందయ్యో.. అంతా ఆగమాగం చేసింది… ఫ్యామిలీ వేడుకలో షాకింగ్ ఘటన
ఓ ఫ్యామిలీ దావత్ పీక్ స్టేజ్‌లో ఉండగా అనుకోని అతిథి వారి మధ్య ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వచ్చింది ఆ ఫ్యామిలీ బంధువు అయితే పిలవకున్నా వచ్చింనందుకు సంతోషపడి ఇంత మర్యాద చేసి పంపించేవారు. కానీ ఆక్కడికి వచ్చింది ఓ ఎద్దు. ఫంక్షన్ హడావుడి చూసిన ఆ ఎద్దుకు ఏమనిపించిందో ఏమో...

ఓ ఫ్యామిలీ దావత్ పీక్ స్టేజ్‌లో ఉండగా అనుకోని అతిథి వారి మధ్య ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వచ్చింది ఆ ఫ్యామిలీ బంధువు అయితే పిలవకున్నా వచ్చింనందుకు సంతోషపడి ఇంత మర్యాద చేసి పంపించేవారు. కానీ ఆక్కడికి వచ్చింది ఓ ఎద్దు. ఫంక్షన్ హడావుడి చూసిన ఆ ఎద్దుకు ఏమనిపించిందో ఏమో ఏకంగా వారి మధ్యకు పోయి నిల్చుంది. పాటలు, డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీని తదేకంగా చూస్తూ అక్కడే నిల్చుండిపోయింది.
అయితే ఎద్దును చూసిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ భయపడిపోయారు. ఎందుకైనా మంచిదని ఇద్దరు యువకులు తాళ్లతో బంధించారు. ఇక పాటల సౌండ్ మరింత పెంచుతూ డ్యాన్స్ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఎద్దుకు ఏమనిపించిందో ఏమో అక్కడున్న వారిని తొక్కుకుంటూ వెళ్లి వేదిక మిదికి ఎక్కింది. అక్కడ కొంచెసేపు కాళ్లు కదిపినట్లు చేసి మళ్లీ గెంతులేస్తూ కిందికి ఊరికింది. ఎద్దు దూకుడును చూసిన మహిళలు, చిన్నారులు భయపడిపోయి అక్కడి నుంచి ఉరుకులు పెట్టారు. చివరకు ఆ ఎద్దును యువకులు మరోసారి బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎద్దు దాడిలో పలువురు గాయపడ్డి ఉండొచ్చని తెలుస్తుంది.
వీడియో చూడండి:
Panic at the disco after a Bull attack: pic.twitter.com/KHhySUOgSC
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 13, 2025
ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది సమాచారం లేకపోయినప్పటికీ నెట్టింట్లో మాత్రం వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. పసుపు రంగు చీరలో ఉన్న ఒక మహిళ ఎద్దు కింద నుండి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దానిని రెచ్చగొట్టిందని చాలా మంది వినియోగదారులు ఎత్తి చూపారు.
