Viral Video: వ్యక్తిని వెంటాడిన పశువులు.. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో వైరల్
Viral Video: ఇంటర్నెట్‌లో రోజు వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే.. మరి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి..
Viral Video: ఇంటర్నెట్‌లో రోజు వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే.. మరి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోలు ఎంతో నవ్వి్‌స్తుంటాయి. ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఫన్నీగా ఉంది. కొన్ని పశువులు ఓ వ్యక్తిని మైదానంలో పరుగులు పెట్టించాయి. మైదానంలో మేస్తున్న పశువులు ఓ వ్యక్తిని వెంబడించాయి. అవి వెంబడించడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీశాడు. అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీయగా, చివరికి ఓ నీటి కాలువలో పడిపోవడంతో ఫన్నీగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు.
View this post on Instagram
ఈ వ్యక్తి నీటి కాలువలో జారి పడిపోయే వరకు ఈ పశువులు ఈ మనిషిని ఎలా వెంబడించాయో వీడియోలో చూడవచ్చు. హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్న ఫన్నీ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ క్లిప్‌ను సుమారు 42 వేల సార్లు వీక్షించారు. ఈ వీడియో వేల సంఖ్యలో లైక్‌లు, షేర్‌లతో ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి