Telugu News Trending Video of the child reporting has gone viral on social media Telugu Viral News
Viral Video: ప్రొఫెషనల్ రిపోర్టర్లకు ఏ మాత్రం తగ్గకుండా.. కెమెరా ముందు అదరగొట్టేసిన చిన్నోడు
సోషల్ మీడియా (Social Media) వచ్చినప్పటి నుంచి వీడియోలకు కొదవ లేకుండా పోయింది. నిత్యం కొన్ని వేల వీడియోలు ఇంటర్నెట్ లో పోస్ట్ అవుతుంటాయి. వీటిలో నవ్వు తెప్పించే వాటితో పాటు ఆశ్చర్యం కలిగించే వీడియోలూ ఉంటాయి. ప్రస్తుతం...
సోషల్ మీడియా (Social Media) వచ్చినప్పటి నుంచి వీడియోలకు కొదవ లేకుండా పోయింది. నిత్యం కొన్ని వేల వీడియోలు ఇంటర్నెట్ లో పోస్ట్ అవుతుంటాయి. వీటిలో నవ్వు తెప్పించే వాటితో పాటు ఆశ్చర్యం కలిగించే వీడియోలూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పాఠశాల విద్యార్థులు జర్నలిస్టులుగా మారి.. రిపోర్టింగ్ చేస్తున్న తీరు నవ్వు తెప్పిస్తుంది. అదే సమయంలో ఆలోచనలో పడేస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్ (Viral) అవుతోన్న చిన్నారుల జర్నలిజానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో జార్ఖండ్, బిహార్ సరిహద్దులో ఉన్న గొడ్డా జిల్లాలో ఉంది. ఇక్కడ చదువుతున్న ఆరో తరగతికి చెందిన సర్ఫరాజ్ అనే విద్యార్థి జర్నలిస్టుగా మారి పాఠశాల పరిస్థితి గురించి రిపోర్టింగ్ చేస్తూ వివరిస్తున్నాడు. పాఠశాలలో బోధన సరిగ్గా జరగడం లేదని, అందుకే తన సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకునేలా ఈ వీడియో తీసినట్లు సర్ఫరాజ్ వివరించాడు. మధ్యాహ్నం 12:45 అవుతున్నా ఉపాధ్యాయులు టీచింగ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీచర్లు సమయానికి క్లాసులకు రావడం లేదని, నీళ్లు తాగేందుకూ చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని ఏకరవు పెట్టాడు. అంతే కాకుండా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరాడు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకు చాలా వ్యూస్ వచ్చాయి. వేలకొద్దీ లైకులు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా వీడియో చూశాక నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ చిన్నారి నిజమైన జర్నలిజానికి నా హృదయపూర్వక వందనం’ అని, ‘ఇక నుంచి నిజమైన జర్నలిస్టుగా మారే అన్ని లక్షణాలు చిన్నారిలో కనిపిస్తున్నాయి’ అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.