AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గేటు తీయగానే మీద దూకెసిన సింహం.. అప్పుడతను ఏం చేశాడంటే..

సింహాన్ని టీవీలో కానీ.. ఫొటోలో కానీ.. ఫోన్‎లో కానీ.. చూస్తాం.. ఇంకా దగ్గరగా చూడాలంటే.. జూకు వెళ్తాం.. జూలో బోనులో ఉన్న సింహాన్ని చూస్తాం...

Viral Video: గేటు తీయగానే మీద దూకెసిన సింహం.. అప్పుడతను ఏం చేశాడంటే..
Lion
Srinivas Chekkilla
|

Updated on: Dec 19, 2021 | 11:00 AM

Share

సింహాన్ని టీవీలో కానీ.. ఫొటోలో కానీ.. ఫోన్‎లో కానీ.. చూస్తాం.. ఇంకా దగ్గరగా చూడాలంటే.. జూకు వెళ్తాం.. జూలో బోనులో ఉన్న సింహాన్ని చూస్తాం. కానీ దగ్గరికెళ్లి దానితో ఆడుకుంటామంటే.. అది ఏం చెస్తుంది. ప్రాణం తీసి విందు భోజనం చేస్తుంది.. కానీ ఓ వ్యక్తి సింహాన్ని కుక్క పిల్లలా ఆడిస్తున్నాడు. పెంపుడు జంతువు లాగా సింహంతో ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో మొత్తం చూడని వారు సింహం మనిషిపై దాడి చేస్తుందని పొరబడతారు.

వాల్ గ్రూనర్ అనే వ్యక్తి బోట్స్వానా (దక్షిణాఫ్రికా)లోని కలహరి ఎడారిలో రిజర్వ్‌లో సిర్గా అనే సింహానికి సంరక్షకుడు. 9 ఏళ్ల సింహాన్ని వాల్ పెంచారు. అతను తరచుగా తన సిర్గా చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటాడు. అతను ఇన్‎స్టాలో 78 వేల అనుచరులను కలిగి ఉన్నాడు. అతను సిర్గా కోసం ‘sirgathelioness’ అనే ప్రత్యేక ఖాతాను తెరిచాడు.

అతను కొన్ని వారాల క్రితం క్రింది వీడియోను అప్‌లోడ్ చేసాడు. “కలహరి క్యాట్‌వాక్”. ఈ పోస్ట్‌కి దాదాపు 2,700 లైక్‌లు వచ్చాయి. కలహరి రిజర్వ్‌లో సిర్గా జీవితం స్నిప్పెట్‌లను వీడియోలో చూపిస్తుంది. వీడియో ప్రారంభం కాగానే, వాల్ సింహం ఎన్‌క్లోజర్ గేట్‌ను తెరవడం చూడవచ్చు. అప్పుడు, సిర్గా అతనిని పలకరించడానికి దూకి అతడిని కౌగిలించుకుంటుంది.

View this post on Instagram

A post shared by Sirga (@sirgathelioness)

Read Also.. pilot to truck driver: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..