Viral Video: ఊడిపోయిన జుట్టుని పోగుచేసి డబ్బులు సంపాదిస్తున్న యువతి.. రెండేళ్లుగా సేకరిస్తున్నట్లు ప్రకటన..
మనిషికి అందాన్ని తీసుకొచ్చేది జుట్టు. అందుకే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సంరక్షణ కోసం రకరకాల టిప్స్ పాటిస్తారు. అంతేకాదు జుట్టుని నల్ల బంగారం అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే జుట్టుకి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారతీయుల జుట్టుకి విపరీతమైన క్రేజ్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన జుట్టును అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించింది. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత కాలంలో అత్యంత కష్టమైన పని డబ్బులు సంపాదించడమే.. సులభమైన పని కూడా డబ్బు సంపాదించడమే. కొంతమంది తమ ఆలోచనలకు పదును పెట్టి పనికి రాని వస్తువుల నుంచి కూడా డబ్బులను సంపాదిస్తారు. పనికిరానివిగా భావించే వస్తువులను ఆదయ మార్గాలుగా మార్చుకున్న వార్తల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. అలాంటి కథలను గురించి విన్న తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక వీడియో ఒకటి ప్రజలలో చర్చనీయాంశమైంది. ఒక అమ్మాయి ఊడిపోయిన తన జుట్టుని రెండేళ్లపాటు సేకరించి, చివరకు వాటిని అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించింది. ఆమె దీనిని వీడియో చేసినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రపంచ మార్కెట్లలో విరిగిన జుట్టుకు భారీ డిమాండ్ ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రజలు జుట్టుని ఇప్పుడు నల్ల బంగారం అని పిలిచేంతగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన భారతీయుల జుట్టు గురించి మాట్లాడుకుంటే.. భారతీయుల జుట్టు రంగు, ఆకృతి చాలా బాగుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో కూడా భారతీయుల జుట్టుకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. జుట్టుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, దీనిలో ఒక అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా తన జుట్టును సేకరిస్తున్నానని, దానిని అమ్మినందుకు ప్రతిఫలంగా తనకు చాలా డబ్బు వచ్చిందని చెప్పింది.
ఈ వీడియోలో ఒక అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ఊడిపోయిన తన జుట్టును దువ్వి.. దానిని ప్లాస్టిక్ పెట్టెలో పెట్టి సేకరిస్తున్నానని చెప్పింది. ఆ పెట్టె జుట్టుతో నిండిన తర్వాత ఆ అమ్మాయి దానిని తూకం వేసి అమ్ముతుంది. ప్రతిగా, ఆమెకు రూ. 190 డబ్బులు లభించాయి. ఈ మొత్తం సంఘటనను ఆమె వీడియో చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. ఒక వ్యక్తి కిలోగ్రాము జుట్టుకి రూ. 2,500 చొప్పున చెల్లించి జుట్టుని కొన్నాడు.
View this post on Instagram
ఈ వీడియోను being_earthfriendly అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. లక్షలాది మంది దీనిని చూశారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు దీనిపై ఫన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ మహిళ డబ్బు సంపాదించడానికి ఎంత గొప్ప ఆలోచనచేసింది. మరొకరు నేను అక్కడ ఉంటే అంత జుట్టుకు కనీసం రూ. 1,000 తీసుకునేవాడిని అని రాశారు. మరొకరు రాలిపోతున్న నా జుట్టుని పోగు చేసి నేను కోటీశ్వరుడిని కాగలనని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




