Necktie: రోజూ నెక్ టైని ధరిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా..
వివాహాలు, గ్రాడ్యుయేషన్ లేదా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలలో పురుషులు ఆకర్షణీయంగా కనిపించడానికి ఖచ్చితంగా టై ధరిస్తారు. ఎందుకంటే నెక్ టై ఒక వ్యక్తి శైలిని, వ్యక్తిత్వాన్ని, అధికారికతను సూచిస్తుందని నమ్ముతారు. అయితే నెక్ టై ని ఎక్కువగా ధరించడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? చొక్కా కాలర్ కింద లేదా గొంతు దగ్గర కట్టుకునే ఈ టై ధరించడం వలన కలిగే హాని ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ తమ లుక్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకని సందర్భాన్ని, ప్రదేశాన్ని బట్టి దుస్తులను ఎంపిక చేసుకుంటారు, ఉదాహరణకు పెళ్లి లేదా పార్టీ, ప్రయాణం, ఆఫీసు వంటి ప్రతి సందర్భానికి వేర్వేరు దుస్తులను ధరిస్తారు. ఇలా చేయడం అక్కడ ఉన్న పరిస్థితికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసు, సమావేశం లేదా ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్ లుక్ కోసం టైలు ధరిస్తారు. అంతేకాదు పెళ్లి సమయంలో కోటు ప్యాంటు తో పాటు టై ని ధరిస్తారు. ఇక స్టూడెంట్స్ కూడా స్కూల్ యూనిఫామ్ తో పాటు టై ని తప్పనిసరిగా దుస్తులతో ధరిస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, కంపెనీలలో టై ధరించడం డ్రెస్ కోడ్‌లో తప్పనిసరి భాగం.
టై అనేది ఫ్యాషన్ యాక్సెసరీగా పనిచేస్తుంది. ప్రజలు తమ వ్యక్తిత్వాన్ని, శైలిని మెరుగుపరచుకోవడానికి కూడా దీనిని ధరిస్తారు. తాము ధరించే షర్ట్ కి తగిన రంగుని ఎంచుకుని టైని ధరించి తమ లుక్ కి మరింత మెరుగులు దిద్దుకుంటారు పురుషులు. అంతేకాదు వృత్తిపరంగా టై ధరించడం వల్ల ప్రొఫెషనల్‌గా ఠీవిగా కనిపిస్తామని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఇక టై ధరించిన వ్యక్తి పని పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుందని అనుకుంటాడు. అంతగా టై పురుషుల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే టై ధరించడం వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుందని మీకు తెలుసా?
టై వేసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా? అవును కొన్ని అధ్యయనాలు చాలా టైట్ గా టై ధరించడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని.. ఎంతగా రక్త ప్రసరణ తగ్గిస్తుందంటే దాదాపు 7.5 శాతం వరకు ఉంటుందని కనుగొన్నాయి. ఇలా రక్త ప్రసరణ తగ్గడం అనేది మెడ సిరలపై ఒత్తిడి వల్ల కావచ్చు. సాధారణంగా రక్త ప్రవాహంలో 7.5 శాతం తగ్గుదల పెద్ద సమస్య కాదు.. అయితే అది వ్యక్తి శారీరక స్థితి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.
టై మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా?
2018లో న్యూరోరేడియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో ఈ విషయం చెప్పబడింది. ఈ పరిశోధన జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ష్లెస్విగ్-హోల్‌స్టెయిన్‌లో జరిగింది. ఈ అధ్యయనంలో 21 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల 30 మంది యువకులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని వ్యక్తులు విండ్సర్ ముడితో బిగించిన నెక్‌టైను 15 నిమిషాలు ధరించారు. రెండవ గ్రూపు వారు టై ధరించలేదు. అయితే టై ధరించిన మొదటి గ్రూప్ వ్యక్తులు స్వల్ప అసౌకర్యానికి గురయ్యారు. MRI స్కాన్ చేయగా ఈ విధంగా టై ధరించడం వల్ల మెదడులో రక్త ప్రవాహం 7.5% తగ్గిందని.. టై వదులు చేసుకున్న 15 నిమిషాల తర్వాత కూడా ఈ పరిస్థితి 5.7% వద్దనే ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు టై ధరించని రెండవ గ్రూపు వారి రక్త ప్రసరణలో ఎటువంటి మార్పు లేదు.
ఇది ఆందోళన కలిగించే విషయమా? సాధారణంగా రక్త ప్రవాహంలో 7.5 శాతం తగ్గుదల పెద్ద సమస్య కాదు. అయితే టై ధరించే వ్యక్తి శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎవరైనా ఇప్పటికే అధిక రక్తపోటు (హై బీపీ) లేదా గుండె సమస్య వంటి ఆరోగ్య సమస్య ఉంటే.. టై ధరించే విషయంలో శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కనుక ఈ సమస్యలున్నవారు టై ధరించాలనుకుంటే.. దానిని బిగుతుగా దరించవద్దు. వదులుగా ఉండే టై ధరించండి. క్రమం తప్పకుండా టైను లూజ్ చేసుకుంటూ కదుపుతూ ఉండడం వలన మెడను తిప్పడం వంటి చర్యల వలన గొంతు దగ్గర రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








