Viral Video: కుక్క పిల్లను దత్తత తీసుకున్న కోతి.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో
Monkey Dog Friendship Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వైరల్ అవుతున్న

Monkey Dog Friendship Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. అయితే.. సాధారణంగా కోతులు, కుక్కల మధ్య సయోధ్య కుదరదు. వీటిమధ్య పోరాటానికి సంబంధించిన వార్తలు ఇటీవల చాలానే వెలుగులోకి వచ్చాయి. కోతుల గుంపు.. కుక్కలను చంపిన ఘటనకి సంబంధించి #MonkeyVsDog అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. కోతులు, కుక్కల మధ్య ఈ గ్యాంగ్ వార్ కారణంగా.. నెటిజన్లు ట్విట్టర్‌లో ఫన్నీ మీమ్‌లను కూడా పంచుకుంటున్నారు. దీనిపై చాలా మంది తమాషాగా స్పందిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్యలో కోతి, కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మునేంద్రనగర్‌లో గత 5 రోజులుగా.. కోతుల గుంపు కుక్కపిల్లతో సరదాగా ఆడుకుంటున్నాయి. దీంతోపాటు.. వాటి పిల్లల్లాగానే కోతి చిన్న కుక్క పిల్లకు ఆహారం తినిపిస్తుంది.
అయితే.. కోతి, కుక్క మధ్య స్నేహాన్ని రుజువు చేసే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మనేంద్రగఢ్‌లోని రైల్వే కాలనీ ప్రజలు తమ టెర్రస్‌పై కోతితో ఉన్న కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. మొదట్లో ఇది ఒక సాధారణ సంఘటన అని అనుకున్నారు.. కానీ.. కోతుల గుంపు నుండి కుక్కను వేరు చేయాలనుకున్నప్పుడు.. అది దానిని వదిలిపెట్టడం లేదని.. ఆహారం కూడా తినిపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు కోతి తనపిల్లలా కుక్కను చూసుకుంటుందని వదిలిపెట్టడం లేదని పేర్కొన్నారు.
వీడియో చూడండి
छत्तीसगढ़ के मनेन्द्रगढ़ में बीते 5 दिनों से इस छोटू को लेकर घूम रहा है, अपने साथ खाना खिलाता है लोगों ने दोनों को अलग करना चाहा लेकिन बंदर उसे छोड़ने को तैयार नहीं. pic.twitter.com/CLlRODM82k
— Anurag Dwary (@Anurag_Dwary) December 21, 2021
దీని తర్వాత కోతి నుంచి కుక్కను విడిపించేందుకు ప్రజలు ఆహార పదార్థాలను పైకప్పులపైకి విసిరారు. అయితే.. కోతి ఆహార పదార్థాలను తీసుకెళ్లింది. కానీ ఇప్పటికీ కుక్కను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ సంఘటనను చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కోతి కుక్కను దత్తత తీసుకుంటుందంటూ పేర్కొంటున్నారు.
Also Read: