Viral Video: చెత్త ఏరుకునే పిల్లలకు ఊహించని వరం… దిల్ అంటే నీదే బాస్!
లగ్జరీ కారుకు ఉండే క్రేజే వేరు. లగ్జరీ కారులో ప్రయాణించాలని మనలో చాలా మందికి ఒక కల. కొంతమందికి అది జీవితాంతం ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ ఇటీవల ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నలుగురు చెత్తను సేకరించే పిల్ల పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసింది. ఒక వ్యక్తి పార్క్ చేసిన ఫోర్డ్ ముస్తాంగ్ కారు...

లగ్జరీ కారుకు ఉండే క్రేజే వేరు. లగ్జరీ కారులో ప్రయాణించాలని మనలో చాలా మందికి ఒక కల. కొంతమందికి అది జీవితాంతం ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ ఇటీవల ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నలుగురు చెత్తను సేకరించే పిల్ల పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసింది. ఒక వ్యక్తి పార్క్ చేసిన ఫోర్డ్ ముస్తాంగ్ కారును ఆ పిల్లలు చూస్తారు. ఎంతో స్టైలిష్‌గా మాడర్న్ గా ఉన్న ఆ కారు నచ్చడంతో దాన్ని వద్దకు వస్తారు. అలాంటి కారులో ప్రయాణించడం ఎలా ఉంటుందో అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల సంభాషణ విన్న కారు యజమాని వారి కోరికను నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తన కారు దగ్గర నిలబడి ఉన్న పిల్లలను గుర్తించడం కనిపిస్తుంది. అతనితో మాట్లాడుతూ, పిల్లలలో ఒకరు, “నేను నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వాహనాన్ని చూడలేదు” అని అంటున్నారు. “నేను దీనిలో ప్రయాణించాలనుకుంటున్నాను” అని మరొకరు అంటారు. అప్పుడు యజమాని వారిని తన కారు వద్దకు తీసుకెళ్లి లోపల కూర్చోమని డోర్ తెరుస్తాడు.
వారిలో ముగ్గురు వెనుక సీట్లలోకి ఎక్కుతారు, ఒకరు ముందు సీట్లలో కూర్చోమని యజమాని సూచిస్తాడు. అనంతరం యజమాని కారు నడపడం ప్రారంభిస్తాడు. ఆ పిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇంత పెద్ద లగ్జరీ కారు ప్రయాణాన్ని అనుభవించడం తాము మొదటిసారి అని చెపుతారు.
ఆ వ్యక్తి వారికి రైడ్ ఇచ్చినప్పుడు, వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. వారి ఉత్సాహం ప్రయాణం అంతటా కనిపిస్తుంది. వారు ఉత్సాహంగా, చప్పట్లు కొడుతూ, రైడ్ ప్రతి సెకనును ఆస్వాదస్తారు. ఊహించని అనుభవంతో స్పష్టంగా ఉప్పొంగిపోయి ఎంతో సంతోషపడ్డారు. ఈ వీడియో ఆ కారు యజమాని దయను, కారుణ్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. చిన్న హావభావాలు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉంటాయనే విషయం వీక్షకులకు గుర్తు చేస్తుంది.
వీడియో చూడండి:
View this post on Instagram
రైడ్ ముగియగానే, పిల్లలు ప్రకాశవంతంగా నవ్వుతూ, కృతజ్ఞతతో వీడ్కోలు పలికుతారు. వారి సంచులను భుజాలపై వేసుకుని వెళ్ళిపోతారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. “దుస్రో కి ఖుషి మే హాయ్ అప్ని ఖుషి హై” (నిజమైన ఆనందం ఇతరుల ఆనందంలో ఉంది) అనే శీర్షికతో క్యాప్షన్ ఇచ్చారు. గోల్డెన్ హార్ట్ గై అని నెటిజన్స్ కారు యజామానిని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ఫరీదాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది.




