Viral Video: పెళ్లివేడుక్కి పల్లకీలో బదులు.. లెహంగాతో బుల్లెట్ మీద వచ్చిన పెళ్లికూతురు .. వీడియో వైరల్

కొన్నిసార్లు పెళ్లి వేడుకలో వధూవరుల కారణంగా మరొకొన్ని సార్లు స్నేహితులు తమ చిలిపి పనులతో వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్ళికి వచ్చిన ఆహుతులను ఆకట్టుకుంటున్నారు.

Viral Video: పెళ్లివేడుక్కి పల్లకీలో బదులు.. లెహంగాతో బుల్లెట్ మీద వచ్చిన పెళ్లికూతురు .. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2022 | 9:40 AM

Viral Video: ఒకప్పుడు పెళ్లంటే.. నవ వధువు సిగ్గు పడుతూ.. తన కనురెప్పల మాటున రహస్యంగా తన కాబోయే జీవిత భాగస్వామిని చూసేది. పెళ్లి వేదిక వద్దకు వరుడు.. ఉరేగింపుగా వచ్చేవాడు.. వరుడిని చూడడానికి ఊరిలోని వారు..వధువు స్నేహితులు, బంధువులు ఇళ్ల పై కప్పులు కూడా ఎక్కేవారు. పెళ్లి తర్వాత నవ దంపతులకు డోలీలో ఊరేగిస్తూ తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అన్నిటితో పాటు.. పెళ్లి వేడుక జరిగే పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. వరుడు చేసే పనులన్నీ ఈరోజు పెళ్లికూతురు చేస్తోంది. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది .

భారతీయ హిందు వివాహం సంప్రదాయంలో ఇది ఖచ్చితంగా భిన్నం అంటూ వార్తల్లో నిలిచింది. కొన్నిసార్లు పెళ్లి వేడుకలో వధూవరుల కారణంగా మరొకొన్ని సార్లు స్నేహితులు తమ చిలిపి పనులతో వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్ళికి వచ్చిన ఆహుతులను ఆకట్టుకుంటున్నారు. అయితే వైరల్‌గా మారిన ఈ వీడియోలో వధువు హల్‌చల్ చేసింది. పెళ్లికూతురు సాంప్రదాయ దుస్తులు ధరించి బుల్లెట్ నడుపుతుంది. కూల్ కూల్ స్టైల్‌లో పెళ్లికూతురు బుల్లెట్‌పై కూర్చొని ధూమ్ సినిమాలో హీరో బైక్ నడిపినట్లు రోడ్డుపై ‘ధూమ్ ధామ్’ చేస్తోంది. పెళ్లికూతురు  బుల్లెట్ నడిపే స్టైల్‌ని చూసి కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి పీటలు ఎక్కేందుకు పెళ్లికూతురు బుల్లెట్ పై పెళ్లి వేదిక వద్దకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వధువు అందమైన లెహంగా ధరించి బుల్లెట్‌పై కూర్చొని.. ఎక్కడా తడబడకుండా.. రయ్యి రయ్యి మంటూ.. బుల్లెట్ నడుపుకుంటూ..వేదిక వద్దకు చేరుకుంది. వధువు బుల్లెట్‌ను ఎక్కి.. దానిని స్టార్ట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘deera.makeovers’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొద్ది సేపటికే వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు.  ‘లెహంగా చక్రంలో ఇరుక్కుపోతే అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..