Bull attack: ఎడ్ల పోటీల్లో అపశృతి.. యువకుడ్ని పడేసి కుమ్మేసిన ఎద్దు.. ఈ షాకింగ్ వీడియో చూసి నెటిజన్స్ రియాక్షన్..
సాధారణంగా ఎడ్లు సాధు జీవులే అయినా కోపం వస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తాయి. కొన్ని దేశాల్లో ఎడ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా ఎడ్లు సాధు జీవులే అయినా కోపం వస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తాయి. కొన్ని దేశాల్లో ఎడ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడ్ల పోటీల్లో ఓ ఎద్దు తన విశ్వరూపాన్ని చూపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఎడ్ల పోటీలు జరుగుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక వ్యక్తి వాటి ముందు నిలబడి ఓ ఎద్దును రమ్మని సైగ చేస్తూ ఆహ్వానించాడు. దాంతో ఆ ఎద్దు అతనివైపు దూసుకువచ్చింది. అతడ్ని కొమ్ములతో కిందపడేసి తీవ్రంగా దాడి చేసింది. ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అప్రమత్తమైన నిర్వాహకులు ఎద్దును అదుపులోకి తీసుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వందలాది మంది వీడియోను లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంఘటన అని కొందరు, గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మరికొందరు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

