AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aliens News: భూమిపై ఏలియన్స్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాయా? ఆ వీడియోలో ఉన్నదేంటి?

Aliens News: అనంత విశ్వంలో జీవం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఉంటాయి. మనలాంటి బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారు. రేపో మాపో వారితో మనకు మాటా ముచ్చట కూడా జరగవచ్చు.

Aliens News: భూమిపై ఏలియన్స్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాయా? ఆ వీడియోలో ఉన్నదేంటి?
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2022 | 9:16 AM

Aliens News: అనంత విశ్వంలో జీవం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఉంటాయి. మనలాంటి బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారు. రేపో మాపో వారితో మనకు మాటా ముచ్చట కూడా జరగవచ్చు. అసలు గ్రహాంతరవాసుల కోసం మన అన్వేషణ ఇప్పటిదేం కాదు.. ఎప్పట్నుంచో వారి కోసం వెతుకుతున్నాం. అప్పుడప్పుడు మనకు తారసపడుతున్న యుఎఫ్‌వోలు గ్రహాంతరవాసులపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మొన్నటికి మొన్న అంటే న్యూ ఇయర్‌ రోజున ఏలియన్స్‌కు సంబంధించిన ఓ యుఎఫ్‌ఓ భూమ్మీదకు వచ్చిందట. ఇప్పుడిదే విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా.. ఏంటది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. తాజాగా అమెరికాలోని సెయింట్‌ ఆల్బన్స్‌లో మూడు లైట్లతో కూడిన ఓ యూఎఫ్ఓ గాల్లో చక్కర్లు కొట్టింది. త్రిభుజాకారంలో ఉన్న ఈ యుఎఫ్ఓ లైట్లు మిణుకు మిణుకు మంటూ మెరుస్తూ కదిలాయి. సరిగ్గా న్యూ ఇయర్‌ రోజు రాత్రి 12 గంటల సమయంలో ఇది కనిపించింది. సెయింట్ ఆల్బన్స్‌లోని ఓ వ్యక్తికి ఈ దృశ్యం కనిపించిందట. అయితే, ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ అంతా అతని ఇంటి పెరట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏలియన్స్ భూమిపై న్యూఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చి ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఈ వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తున్నారు. కావాలనే క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారంటూ విమర్శలు చేస్తున్నారు.

Viral Video:

Also read:

100 Momos Challenge: వామ్మో.. ‘భీమిలి కబడ్డి’లో ధన్‌రాజ్ లాగే కుమ్మేసిందిగా.. కానీ చివరికి..

Sampreeti Yadav: గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం.. ఈ యువతి వేతనం కోటీపైనే..!

Chanakya Niti: ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఈ లక్షణాలను తప్పక గమనించండి..