AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 Momos Challenge: వామ్మో.. ‘భీమిలి కబడ్డి’లో ధన్‌రాజ్ లాగే కుమ్మేసిందిగా.. కానీ చివరికి..

100 Momos Challenge: సాధార‌ణంగా ఓ 10 మోమోస్ తింటే.. క‌డుపు నిండిపోతుంది. మ‌ళ్లీ అన్నం తినాల‌న్నా క‌ష్టమే. కానీ.. ఓ యువ‌తి మాత్రం ఏకంగా 100 మోమోస్ తినేందుకు చాలెంజ్‌ను స్వీక‌రించింది.

100 Momos Challenge: వామ్మో.. ‘భీమిలి కబడ్డి’లో ధన్‌రాజ్ లాగే కుమ్మేసిందిగా.. కానీ చివరికి..
Shiva Prajapati
|

Updated on: Jan 07, 2022 | 9:03 AM

Share

100 Momos Challenge: సాధార‌ణంగా ఓ 10 మోమోస్ తింటే.. క‌డుపు నిండిపోతుంది. మ‌ళ్లీ అన్నం తినాల‌న్నా క‌ష్టమే. కానీ.. ఓ యువ‌తి మాత్రం ఏకంగా 100 మోమోస్ తినేందుకు చాలెంజ్‌ను స్వీక‌రించింది. అవి కూడా చికెన్ మోమోస్. ఆ యువ‌తి ఒక యూట్యూబ‌ర్‌. త‌న పేరు మాధురి ల‌హ‌రి. త‌న‌కు మ్యాడీ ఈట్స్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్‌లో ఇలా ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది.

100 మోమోస్ తినేందుకు తెగ ప్రయ‌త్నించింది కానీ.. వాటన్నింటినీ తిన‌లేక‌పోయింది. చివ‌ర‌కు ఓ 20 మోమోస్‌ను మిగిల్చినా.. 80 మోమోస్ తిని గ్రేట్ అనిపించుకుంది. ఈ ఛాలెంజ్ చేసి చాలా రోజులే అయినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ వీడియో చూసి.. ఏంటి త‌ల్లి.. ఎందుకు నీకు అంత క‌ష్టం. అన‌వ‌స‌ర‌మైన చెత్తను తిని లేనిపోని రోగాలు తెచ్చుకుంటావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. అన్ని మోమోస్ తిన‌డం కోసం త‌ను ప్రయ‌త్నించిన తీరును మెచ్చుకుంటున్నారు.

నిజానికి.. మోమోస్ అనేవి సౌత్ ఇండియ‌న్స్‌కు పెద్దగా ప‌రిచ‌యం లేని స్నాక్. ఇది ఎక్కువ‌గా నేపాల్‌లో దొరుకుతుంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా మోమోస్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. కాక‌పోతే.. మ‌న ద‌గ్గర నేపాల్ నుంచి వ‌చ్చి ఇక్కడ మోమోస్ అమ్మేవాళ్లు అక్కడ‌క్కడా క‌నిపిస్తారు.

Also Read:

Sampreeti Yadav: గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం.. ఈ యువతి వేతనం కోటీపైనే..!

Chanakya Niti: ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఈ లక్షణాలను తప్పక గమనించండి..

Andhra Pradesh: విజయనగరంలో మిస్టరీగా మారిన కానిస్టేబుల్ మిస్సింగ్.. అసలేం జరిగిందంటూ..