Viral Video: 2ఏళ్ల చిన్నారి బాలుడి కోరిక తీర్చిన పైలెట్.. చిన్నారి నవ్వుకి నెటిజన్లు ఫిదా..

Viral Video: విమానం(aircraft) ఎక్కాలని .. గగనతలంలో పక్షిలా విహరించాలని చాలామంది కోరుకుంటారు. అయితే విమానంలోని కాక్‌పిట్(cockpit) లో కొంత సమయం అయినా గడపాలని.. పైలెట్ ప్లేస్ లో కూర్చుని ..

Viral Video: 2ఏళ్ల చిన్నారి బాలుడి కోరిక తీర్చిన పైలెట్.. చిన్నారి నవ్వుకి నెటిజన్లు ఫిదా..
2 Year Old Boy Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 27, 2022 | 4:01 PM

Viral Video: విమానం(aircraft) ఎక్కాలని .. గగనతలంలో పక్షిలా విహరించాలని చాలామంది కోరుకుంటారు. అయితే విమానంలోని కాక్‌పిట్(cockpit) లో కొంత సమయం అయినా గడపాలని.. పైలెట్ ప్లేస్ లో కూర్చుని .. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకున్నాడు ఓ చిన్నారి. ఎందులకంటే విమానంలోని కాక్ పీట్, విండ్‌షీల్డ్‌తో పాటు విమానం ఫ్రంట్ ఎండ్‌, విమానాన్ని నియంత్రించడానికి  ఉపయోగించే అనేక రకాలైన బటన్‌లను ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తాం. అయితే ఒక పసిపిల్లవాడు విమానంలో కాక్‌పిట్‌లో కూర్చోవాలనే తన కలను నెరవేర్చుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో.. రెండేళ్ల చిన్నారి విమానం కాక్‌పిట్ వైపు నడుస్తోంది. తరువాత.. ఆ బాలుడిని పైలట్ కుర్చీ పైకి ఎక్కి కూర్చోవడానికి సహాయం చేశాడు. అంతేకాదు ఆ పైలట్ తన సీటుపై కూర్చున్న చిన్న పిల్లవాడి తలపై తన టోపీని పెట్టాడు. టోపీ పెట్టిన తర్వాత ఆ చిన్నారి బాలుడు ఎంతో సంతోషంగా నవ్వాడు. పైలట్ చిన్న పిల్లవాడికి విమానం  పనితీరును వివరిస్తున్నాడు. తన కలను నెరవేర్చుకున్న ఆనందం చిన్న పిల్లవాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాక్‌పిట్ చుట్టూ చూస్తున్న చిన్న పిల్లవాడి ఎంతో ఆనందంగా “వావ్”అనడంతో వీడియో ముగుస్తుంది.

2 ఏళ్ల బాలుడికి విమానాలు అంటే చాలా ఇష్టమని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. నేను భవిష్యత్ ఎయిర్‌లైన్ పైలట్‌ని చూస్తున్నాను…చిన్నారి బాలుడు స్వీట్ రియాక్షన్స్ “వావ్”… ఎంత దయగల పైలట్.. ఆ పైలెట్ క్షణం మానవత్వంతో  వ్యవహరించడం.. ఒకరి జీవితంలో మార్పు తెస్తుంది.. క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు.

చిన్న పిల్లవాడి అందమైన హావభావాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. “వావ్. అద్భుతమైన పైలట్ ఈ అందమైన చిన్న పిల్లవాడికి ఎంత ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. ఈ చిన్నారి బాలుడి జీవితంలో ఎపుడూ ఈ సంఘటన గుర్తుంది పోతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే.. ప్రేమతో నిండిపోతుంది.

Also Read:

తలకిందులుగా శివయ్య.. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని నమ్మకం.. ఎక్కడంటే..