AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: యుద్ధ భయాల్లో బుల్ జోరు కొనసాగేనా.. వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయంటే..

Stock Market: రష్యా-ఉక్రెయిన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత గడచిన వారం రోజుల్లో కీలక దశకు చేరుకుంది. రష్యా సైనిక కార్యకలాపాలు పెట్టుబడిదారుల(Indian Investors) మనోభావాలను ఎక్కువ ప్రభావితం చేశాయి.

Stock Market: యుద్ధ భయాల్లో బుల్ జోరు కొనసాగేనా.. వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయంటే..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Feb 27, 2022 | 12:54 PM

Share

Stock Market: రష్యా-ఉక్రెయిన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత గడచిన వారం రోజుల్లో కీలక దశకు చేరుకుంది. రష్యా సైనిక కార్యకలాపాలు పెట్టుబడిదారుల(Indian Investors) మనోభావాలను ఎక్కువ ప్రభావితం చేశాయి. రష్యాపై ఆంక్షలు(Sanctions on Russia) ఇన్వెస్టర్లు భయపడినంత తీవ్రంగా లేకపోవడం.. ఈక్విటీల్లో కొనుగోళ్లు పెరగడం వల్ల శుక్రవారం మార్కెట్లలో సెంటిమెంట్ మారింది. భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 3.6%, 3.4% చొప్పున వారంలో నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రెండూ వరుసగా 3.4%, 5.3% దిగువన ముగియడంతో విస్తృత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

భౌగోళిక రాజకీయ ఆందోళనల ప్రభావం కమోడిటీ ధరల్లో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా చమురు వారంలో 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయి అయిన100 డాలర్ల రేటును అధిగమించింది. రాబోయే వారంలో, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లను అస్థిరంగా ఉంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్.. కాంగ్రెస్ లో చేసిన ప్రకటన కూడా వచ్చే వారం షెడ్యూల్ చేయబడినందున అందరూ దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేశ GDP అంచనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌పుట్ డేటా వచ్చే వారం షెడ్యూల్ రానున్నాయి. దీనికి తోడు వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయనే దానిపై మార్కెట్ ఎనలిస్ట్ లు ఏమంటున్నారంటే.. శుక్రవారం నిఫ్టీ రికవరీ బుల్స్ తిరిగి మార్కెట్ లోకి తిరిగి రావడానికి సానుకూలమైన అంశం. కానీ.. దాదాపు 16700-16800 స్థాయిల కీలకమైన రెసిస్టెన్స్ అధిగమించి నిఫ్టీ సూచీలు గరిష్ఠ స్థాయిలను కొనసాగించడం చాలా కష్టమైన అంశం. అక్కడ నుంచి మార్కెట్లు మరింత పైకి లేస్తే స్వల్పకాలంలో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో తక్షణ మద్దతు 16500 పాయింట్ల వద్ద ఉండనుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి..

Kim Jong-Un: తగ్గేదే లే.. యుద్ధం జరుగుతుండంగా కిమ్ మామ ఏం చేశాడంటే..

Gold: బంగారం కొంటున్నారా.. అయితే ఇలా చేయండి.. ఎలాంటి నష్టం ఉండదు..