Sri Shakteeswara Swamy: తలకిందులుగా శివయ్య.. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని నమ్మకం.. ఎక్కడంటే..
Sri Shakteeswara Swamy: శివుడికి భూమిమీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు. ఎక్కువగా శివయ్యను లింగాకారం(Shiva Linga)లో భక్తులు పూజిస్తారు. శివుడు విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే..
Sri Shakteeswara Swamy: శివుడికి భూమిమీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు. ఎక్కువగా శివయ్యను లింగాకారం(Shiva Linga)లో భక్తులు పూజిస్తారు. శివుడు విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే పుణ్యక్షేత్రాలు బహు అరుదు. అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకొన్నవారు కానీ దర్శించలేరు అని ప్రతీతి. అటువంటి విగ్రహ రూపం ఉన్న క్షేత్రం .. అది శివయ్య తలకిందులు( Sirsa Asana posture)గా ఉన్న ఓ క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం… ఆ క్షేత్రంలో భోళాశంకరుడు విగ్రహ రూపంలోనే … తలకిందులుగా తపస్సు చేస్తూ.. భక్తులచేత పూజింపబడుతున్నాడు. ఈ ఆలయం ప్రపంచలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్దిగాంచింది. అటువంటి ఆలయం ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తున్నారా…! ఆ ఆలయం మన తెలుగురాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే…
- ఆలయ నిర్మాణం: పశ్చిమగోదావరి జిల్లా యనమదుర్రు అనే గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ను తూర్పు చాళుక్యులు కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం అతి పురరాతనమైంది.. అత్యంత విలక్షణ శివలింగాన్ని కలిగి ఉన్నది..
- శ్రీ శక్తీశ్వరాలయ క్షేత్ర విశిష్టత: శీర్షాసనం లో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగం పై దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతీదేవి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు పార్వతీ దేవి తన ఒడిలో పసికందైన సుబ్రమణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్లు కొలువై ఉండడం విశేషం.
- శివుడు తలకిందులుగా దర్శనం ఇవ్వడానికి ప్రాముఖ్యంలో ఉన్న కథ: ఇక్కడ శివుడు తలకిందులుగా దర్శనం ఇవ్వడానికి ఓ కధ ప్రాముఖ్యంలో ఉంది. యమధర్మ రాజు శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు.. ఆ సమయంలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తుంటే.. పార్వతి పసిబాలుడైన సుబ్రమణ్యస్వామిని ఒడిలో లాలిస్తుందట. యముడు తపస్సు చేస్తూ.. ఉన్నపళంగా శివుడిని ప్రత్యక్షం కమ్మని వేడుకొన్నాడట.. యముడి కోరికను మన్నించిన శివుడు.. సతీ సమేతంగా యదాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానికుల కధనం.. ఈ దేవాలయం, అందులోని విగ్రహాలు వందల ఏళ్ల క్రిందట ఓ తవ్వకాల్లో బయల్పడ్డాడని అక్కడివారు చెబుతారు.. అంతేకాదు ఈ విగ్రహాలు త్రేతాయుగం నాటివని ప్రసిద్ధి.
- స్థలపురాణం: యమధర్మ రాజు జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకొని వెళ్ళే పనిమీద విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించమని శివుడిని వేడుకొన్నాడట.. శివుడు యమధర్మరాజుకి ప్రత్యక్షమై ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద క్షేత్రం ఏర్పడుతుందని… ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని.. అప్పటి నుంచి యముడు, శివుడు లయకారులన్న భయం ప్రజలకు పోయి… ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇచ్చాడట… ఆ వర ప్రభావంతోనే ఇక్కడ ఆలయం వెలసిందని… ఈ గుడిలోని శివుడిని పూజిస్తే… దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణంగా చెబుతారు.
- ఎలాచేరుకోవాలంటే: యనమదుర్రు గ్రామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తలకిందుల శివుడిని దర్శించుకోవడానికి యనమదుర్రు చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.. భీమవరం నుంచి బస్సులో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.
Also Read: