AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటారు.. అందులో మీరున్నారా..

Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వ్యక్తి స్వభావంపై అతని రాశి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి పరిస్థితిలు ఏర్పడినా కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. వారు తమకు ఎదురైనా ఎటువంటి క్లిష్ట..

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటారు.. అందులో మీరున్నారా..
Zodiac Sign
Surya Kala
|

Updated on: Feb 27, 2022 | 6:10 PM

Share

Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వ్యక్తి స్వభావంపై అతని రాశి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి పరిస్థితిలు ఏర్పడినా కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. వారు తమకు ఎదురైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పరిస్థితి ఎలా ఉన్నా.. ఏ సమయంలో ఎలా స్పందించాలి..  సంయమనంతో ఎలా పని చేయాలో కొన్ని రాశుల వారికి తెలుసు. చాలా సార్లు.. వీరి అలవాట్లు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కష్ట సమయాల్లో కూడా సంయమనంతో పని చేస్తారు. కష్ట సమయాల్లో కూడా మనల్ని మనం ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఏమి జరిగినా సహనం కోల్పోకుండా ఎలా ఉండాలో కూడా అలాంటి వారి నుండి నేర్చుకుంటాము. వాటి వెనుక జ్యోతిష్యం కూడా పాత్ర ఉండవచ్చు . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం (Astro Tips) ప్రశాంత స్వభావాన్ని ఈ 4 రాశుల వారు కలిగి ఉంటారు. ఆ రాశులు ఏమిటో చూద్దాం..

  1. సింహరాశి : ఈ రాశివారు చాలా తెలివైనవారు. కష్ట సమయాల్లో కూడా నిగ్రహాన్ని కోల్పోకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించిన తర్వాతే తీసుకుంటారు. నిగ్రహాన్ని కోల్పోవడం వలన తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుందని ఈ రాశివారికి తెలుసు.
  2. తుల రాశి: ఈ రాశివారు కూడా సింహ రాశి వారిలాగే ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి జరుగుతున్న అన్యాయం చూస్తేనే కోపం వస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.
  3. మేషరాశి: ఈ రాశివారు ప్రశాంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. తమ నిగ్రహాన్ని కోల్పోవడం ఇష్టపడరు. అంతేకాదు తమ చుట్టూ ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండలని కోరుకుంటారు. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడతారు. ఏదైనా సమస్య ఏర్పడితే.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. ఈ రాశికి చెందిన వారు ప్రశాంతంగా ఉండని వ్యక్తులను ఇష్టపడరు.
  4. ధనుస్సు రాశి: ఈ రాశివారు కూడా చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. మీరు ఈ రాశుల వారితో కలిసి స్నేహ సంబంధాలను కలిగి ఉంటె ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది. అంతేకాదు వీరు తమ భావాలను పైకి అంత త్వరగా వ్యక్తం చేయరు. అన్ని భావాలను మనసులోనే దాచుకుంటారు. ఎప్పుడూ ఏమీ జరగనట్లు నటించడానికి ప్రయత్నిస్తారు. ధనుస్సు రాశి వ్యక్తులు కూడా ప్రశాంతంగా ఉండటానికి ఇతరులకు సహాయం చేస్తారు.  చాలాసార్లు ఇతరులకు సలహాలు కూడా ఇస్తారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. మట్కా పిజ్జా.. తింటే వావ్ అనాల్సిందే..