Viral News: ఇకనైనా వస్తాడెమో.. రెండు నెలలుగా యజమాని సమాధిని వీడని పిల్లి.. భావోద్వేగ పోస్ట్ వైరల్
Cat Viral News: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం
Cat Viral News: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మనసును హత్తుకుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉన్నాయి. అయితే.. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి కుక్కలు మానవులకు అత్యంత విశ్వాసమైన జంతువులుగా ఉంటాయి. కుక్కలు, వాటి యజమానులకు సంబంధించిన అనేక రకాల వీడియోలను మనం ఇప్పటికే చూశాం. అంతేకాకుండా అనేక కథనాలను సైతం వింటూ ఉంటాం. అంతేకాకుండా మనం విధేయత, విశ్వాసం గురించి మాట్లాడుకుంటే ఈ విషయంలో పిల్లులు కూడా ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఈ పెంపుడు పిల్లిని చూడండి.. తన యజమానిని ఎంతగానో ప్రేమిస్తోంది. యజమాని చనిపోయిన తర్వాత కూడా.. అది అతని సమాధి వద్ద కూర్చొని ఉంది. అక్కడి నుంచి కదలకుండా రోజుల తనబడి అలానే ఉందంటూ ఆ ప్రాంత ప్రజలకు పేర్కొంటున్నారు.
ఈ పిల్లి సెర్బియాకు చెందిన షేక్ ముఅమర్ పెంపుడు పిల్లి అని పేర్కొంటున్నారు. నవంబర్ 6, 2021న ముఅమర్ మరణించిన తర్వాత ప్రతిరోజూ.. పిల్లి అతని సమాధి దగ్గర కూర్చొంటుంది. దీంతో ఈ పిల్లి వార్తల్లో నిలిచింది. ట్విటర్ యూజర్ షేర్ చేసిన పోస్ట్‌లో పిల్లి.. మంచుతో కప్పబడి ఉన్న సమాధిపైన కూర్చున్నట్లు మీరు కూడా చూడవచ్చు. ఫోటోతో పాటు పిల్లి ఇంకా అక్కడే ఉందంటూ క్యాప్షన్ రాశారు యూజర్.
సెర్బియా మాజీ ముఫ్తీ షేక్ ముఅమర్ జుకోర్లీ నవంబర్ 6, 2021న గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత నవంబర్ 9న షేర్ చేసిన పోస్ట్‌లో.. ఆ తర్వాత జనవరి 11న లావాడర్ అనే ట్విటర్ యూజర్ చనిపోయిన యజమాని సమాధిపై విచారంగా కూర్చున్న పెంపుడు పిల్లికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. “గత వారం ముఫ్తీ ముఅమర్ జుకోర్లీ మరణించిన తర్వాత.. అంత్యక్రియల అనంతరం పిల్లి అతని సమాధిని విడిచిపెట్టలేదంటూ రాశారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ ముఫ్తీ సమాధి దగ్గర కూర్చుని కనిపిస్తుందని రాశారు. అతను చనిపోయిన తర్వాత కూడా.. అతని పిల్లి అతనితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుందంటూ పేర్కొన్నారు.
After Mufti Muamer Zukorlić passed away last week, his Cat has not left his Grave since his Funeral, and is always seen standing by the Grave of the Mufti.
Even in death, his Cat wants to be close to him no matter what. pic.twitter.com/BKP8bYD6MY
— Lavader (@LavBosniak) November 9, 2021
యజమాని అంత్యక్రియలు జరిగిన రెండు నెలల తర్వాత సమాధి దగ్గర పిల్లి ఉండటాన్ని చూసి చాలామంది భావోద్వేగానికి గురవుతున్నారు. పిల్లి విశ్వాసం, విధేయత గురించి చాలామంది ప్రశంసిస్తుండగా.. పిల్లిని ఎవరైనా త్వరగా దత్తత తీసుకోవాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు. హాచికో అనే జపనీస్ కుక్క తన చివరి శ్వాస వరకు తన యజమాని తిరిగి వస్తారని.. ఎదురుచూసిన విషాద కథను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: