AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Watch: హైదరాబాద్‌కు గోల్డ్ ఐస్ క్రీమ్ వచ్చేసిందోచ్.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..

ఐస్ క్రీమ్.. మనకు గుర్తుకువచ్చిన వెంటనే ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆహా.. అంటూ మనం దగ్గరలోని ఐస్ క్రీమ్ పార్లర్‌కు పరుగులు తీస్తుంటాం. దానికి ఉండే క్రేజ్ అలాంటిది. చిన్న పెద్ద అన్న వయస్సుతో..

Video Watch: హైదరాబాద్‌కు గోల్డ్ ఐస్ క్రీమ్ వచ్చేసిందోచ్.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..
Gold 24 Foil Ice Cream
Sanjay Kasula
|

Updated on: Jan 14, 2022 | 6:36 PM

Share

ఐస్ క్రీమ్.. మనకు గుర్తుకువచ్చిన వెంటనే ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆహా.. అంటూ మనం దగ్గరలోని ఐస్ క్రీమ్ పార్లర్‌కు పరుగులు తీస్తుంటాం. దానికి ఉండే క్రేజ్ అలాంటిది. చిన్న పెద్ద అన్న వయస్సుతో తేడా లేకుండా ఎంతో ఇష్టపడేది హిమక్రిములు. అయితే ఇందులో ఎన్నో వెరైటీలు వస్తున్నాయి. వాటిలో కొత్తదనం కోసం చాలా మంద్రి ట్రై చేస్తున్నారు. కొందరు నెచరల్ ఫ్రూట్స్‌ను క్రీమ్ స్టోన్ తో జోడిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ మరింత ముందుకు వెళ్లింది.. తాజా ఐస్ క్రీమ్‌ను మరింత రిచ్‌గా మార్చేశారు. ఐస్ క్రీమ్ ను బంగారంతో మిక్స్ చేశారు. అవును ఇది నిజం.. ఇది ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్‌లో.. గోల్డ్ ప్లేట్స్ పేర్చిన ఐస్ క్రీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే మీకు 24క్యార‌ట్ గోల్డ్ తో చేసిన ఐస్ క్రీమ్ గురించి మీకు తెలుసా. ఇంత‌కీ ఈ 24క్యార‌ట్ గోల్డ్ ఐస్ క్రీమ్ ఎక్క‌డ దొరుకుతుంది. బంజారాహిల్స్ లో ఈ ఐస్ క్రీమ్స్ దొరుకుతోంది. అది కూడా అందుబాటు ధ‌ర‌లోనే ఉంది. బంజారాహిల్స్ లోని ఐస్ క్రీమ్ పార్లర్ లో వందలాది రకాలైన ఐస్క్రీమ్లు లభిస్తాయి.

కానీ ఈ పార్లర్ కి ప్రత్యేక తీసుకొచ్చింది మాత్రం మినీ మిడాస్ ఐస్క్రీమ్. వివిధ ఫ్లేవర్ లలో రుచికరంగా ఐస్ క్రీమ్ తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ను తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఐస్క్రీం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఆహా అనిపించే రుచి.. అందమైన రూపు కలిగిన ఈ ఐస్ క్రీమ్.. దాన్ని అందించే ఐస్ క్రీం పార్లర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.

ఐస్ క్రీమ్ 500 రూపాయల దగ్గర నుంచి లభిస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ ఐస్క్రీం ఇక్కడ అందిస్తున్నారు. కాగా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ఈ ఐస్క్రీమ్ ట్రెండ్ గా మారింది. మ‌రి మీరు ఒకసారి టేస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..

Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..