AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలా వస్తాయ్‌ బ్రో ఇలాంటి ఐడియాలు..! టేబుల్ ఫ్యాన్ లో సీలింగ్ ఫ్యాన్‌తో హాయిగా..

కొందరు వ్యక్తులు చేసే కొత్త, విభిన్న ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేవి కూడా అనేకం ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇంటర్‌నెట్‌లో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఇక్కడ జుగాద్‌ను తయారు చేసే వ్యక్తి మీరు ఊహించని ఆవిష్కరణను చేశాడు. ఆ వ్యక్తి జుగాద్‌తో ఒక ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్నాడు.

ఎలా వస్తాయ్‌ బ్రో ఇలాంటి ఐడియాలు..! టేబుల్ ఫ్యాన్ లో సీలింగ్ ఫ్యాన్‌తో హాయిగా..
Eiling Fan To Stand Fan
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2025 | 11:51 AM

Share

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో చాలా వీడియోలు మనుషులు చేసే జుగాడ్‌లు మనం చూస్తుంటాం. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొందరు వ్యక్తులు చేసే కొత్త, విభిన్న ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేవి కూడా అనేకం ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇంటర్‌నెట్‌లో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఇక్కడ జుగాద్‌ను తయారు చేసే వ్యక్తి మీరు ఊహించని ఆవిష్కరణను చేశాడు. ఆ వ్యక్తి జుగాద్‌తో ఒక ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్నాడు.

ఇంతకీ ఆ వైరల్‌ వీడియోలో ఏముందంటే..దాదాపు మనందరం రెండు రకాల ఫ్యాన్లను చూసే ఉంటాం. ఒకటి టేబుల్‌ ఫ్యాన్‌, రెండోది సిలింగ్‌ ఫ్యాన్‌. అయితే, ఈ రెండు కలిసి ఉన్న ఫ్యాన్‌ ఎప్పుడైనా చూశారా…? అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది చూస్తే నిజంగానే మీరు కండ్లు తేలేస్తారు. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ లేదా స్టాండ్ ఫ్యాన్ కలిసి కొత్త ఫ్యాన్ తయారు చేశాడు ఇక్కడో వ్యక్తి . ఈ రెండింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ను సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. సదరు వ్యక్తి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను టేబుల్ ఫ్యాన్‌లో అమర్చాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను ఈ ఫ్యాన్‌ను తయారు చేసిన ఇంట్లో వాడుతున్నాడు కూడా. స్వీచ్‌ ఆన్ చేసి అది ఎలా పనిచేస్తుందో కూడా మనకు చూపిస్తున్నాడు. అతడు చేసిన పనికి ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే వీడియో ఇక్కడ వైరల్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి…

మీరు గమనించే ఉంటారు. ఇక్కడ ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే టేబుల్‌ ఫ్యాన్‌ సిలింగ్‌ ఫ్యాన్ రెక్కలతో వేగంతో నడుస్తుంది. ఆ వ్యక్తి చేసిన ఈ అధునాతన ట్రిక్ కొద్ది సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించింది. నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. ఈ అద్భుతమైన ట్రిక్ వీడియో hansi.kathela అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో ఆనందిస్తున్నారు. చాలా మంది ఇందులో ఉన్న ట్రిక్‌ ఏంటా అని పదే పదే చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీడియోని లైక్‌ చేశారు. షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…