- Telugu News Photo Gallery Do not eat banana papaya together disadvantages of eating banana papaya together
అరటి పండు, బొప్పాయి పండు కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..
అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైన పండు. ఎందుకంటే అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ, ప్రతి పండు వాటి సొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఒకే సమయంలో వేర్వేరు లక్షణాలు కలిగిన రెండు పండ్లను తినడం వల్ల హాని కలుగుతుంది. అరటిపండ్లతో పాటు మనం ఎలాంటి పండ్లు తినకూడదో డైటీషియన్లు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 10, 2025 | 12:59 PM

అరటి పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం లభించి శరీర కండరాలు కూడా బలపడతాయి. బొప్పాయి ని రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది.

అరటి, బొప్పాయి రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వాటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది.

అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.




