AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం పిచ్చి భయ్యా.. సొట్ట బుగ్గల కోసం ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో..!

సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి చేసుకున్న డింపుల్ప్లాస్టీ వైరల్ అయ్యింది. సహజంగా లేని సొట్ట బుగ్గలు సృష్టించుకునే ఈ ప్రక్రియపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డింపుల్ప్లాస్టీ సురక్షితమైనదిగా పరిగణించినా, దాని వల్ల వచ్చే ప్రమాదాలు, అందం కోసం ఇంతటి రిస్క్ అవసరమా అనే చర్చను ఈ వీడియో రేకెత్తించింది.

Video: ఇదేం పిచ్చి భయ్యా.. సొట్ట బుగ్గల కోసం ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో..!
Dimpleplasty
SN Pasha
|

Updated on: Oct 30, 2025 | 6:34 AM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు ఇది ఒక డ్యాన్స్ వీడియో, కొన్నిసార్లు ఒక ట్రిక్ వైరల్ అవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. కొంతమందికి సహజంగానే బుగ్గలపై సొంట ఉంటుంది. కొంతమందికి అది అందంగా కనిపిస్తుంది. వాళ్లు నవ్వినప్పుడు బుగ్గపై సొంటలతో మరింత అందంగా కనిపిస్తారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతాజింటాను సొంట బుగ్గల సుందరి అంటారు. అలాగే మన తెలుగు నటుడు మంచు మనోజ్‌కు కూడా సొట్ట బుగ్గలు ఉన్నాయి. వారి అవి సహజంగా వచ్చాయి. కానీ, ఇప్పుడు సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి విచిత్రమైన పనిచేసింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి తన బుగ్గపై ఒక ప్రత్యేకమైన గుంటను సృష్టించుకోవడాన్ని మీరు చూడవచ్చు. శస్త్రచికిత్స ద్వారా లేదా సన్నని తీగ సహాయంతో ఆమె నోటి లోపల ఆ గుంటను సృష్టించారు. తద్వారా బయటి నుండి ఎవరూ అది అసలు గుంట కాదని గమనించలేరు. ఆ అమ్మాయి నవ్వినప్పుడు, ఆమెకు సహజమైన గుంట ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా గుంటలను సృష్టించిన వారిని మీరు చాలా అరుదుగా చూస్తారు. డింపుల్ప్లాస్టీ అని పిలువబడే ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయినా కూడా సొట్ట బుగ్గల కోసం ఇంత రిస్క్‌ అవసరమా అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @gunsnrosesgirl3 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి