AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డీఎస్పీ మామూల్ది కాదు.. ఫ్రెండ్‌కే పంగనామాలు పెట్టింది.. వీడియో వైరల్

ఈ దొంగతనం అంతా ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. డీఎస్పీ నోట్ల కట్టను పట్టుకుని బయటికి వెళ్తున్న దృశ్యాలు ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగిలించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితురాలైన డీఎస్పీ ప్రస్తుతం పరారీలో ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం సిగ్గుచేటు.

Viral Video: డీఎస్పీ మామూల్ది కాదు.. ఫ్రెండ్‌కే పంగనామాలు పెట్టింది.. వీడియో వైరల్
Dsp Caught Stealing 2 Lakhs Cash
Krishna S
|

Updated on: Oct 30, 2025 | 1:33 PM

Share

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు శాఖలోనే ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక మహిళా డీఎస్పీ పోలీసులకే మచ్చ తెచ్చే పని చేసింది. తన స్నేహితురాలి ఇంట్లోనే రెండు లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజీలో ఆ మహిళా అధికారి కరెన్సీ నోట్లను చేతిలో పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాత్‌రూమ్‌కి వెళ్లగా.. డబ్బు మాయం

భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాధితురాలు డీఎస్పీ కల్పనా రఘువంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లినప్పుడు డీఎస్పీ చోరీకి పాల్పడిందని ఆరోపించింది. డీఎస్పీ కల్పనా రఘువంశీ.. తన బ్యాగులోని రూ.2 లక్షల నగదు, మొబైల్ ఫోన్‌ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ దొంగతనం జరిగిన దృశ్యాలు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ఫుటేజీలో మహిళా డీఎస్పీ ఇంట్లోకి వచ్చి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితురాలైన డీఎస్పీ చేతిలో నోట్ల కట్ట కూడా ఆ ఫుటేజీలో రికార్డయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జహంగీరాబాద్ పోలీసులు డీఎస్పీ కల్పనా రఘువంశీపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ నగదు ఇంకా దొరకలేదు. డీఎస్పీ పరారీలో ఉన్నారని, ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ADCP బిట్టు శర్మ తెలిపారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నత అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీసులను షాక్‌కు గురిచేసింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?