Viral Video: బెడిసికొట్టిన స్టంట్.. సముద్రంలో ఇరుక్కున్న కార్.. తర్వాత ఏం జరిగిందంటే?
సూరత్‌లోని డుమాస్ బీచ్ వద్ద ఒక యువకుడు స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఒక యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతను స్టంట్ చేస్తున్న సమయంలో అది బెడిసికొట్టడంతో కారు నీటిలో మునిగిపోయింది. ఎలాగోలా కారులోంచి బయటపడిన యువకుడు క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.

తన ఖరీధైన బెంజ్‌కారుతో బీచ్‌లో స్టంట్ చేసేందుకు ప్రయత్నించిన ఒక యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటర సూరత్‌లోని డుమాస్ బీచ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెజన్ సలీం చాండియా అనే 18 ఏళ్ల యువకుడు తన మెర్సిడెస్ బెంజ్ C220 కారుతో బీచ్‌లో స్టంట్ చేసేందుకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశంలో స్టంట్స్ చేయడం నిషేదం. అయినా నిబంధనలను ఉల్లఘించి.. ఆ యవకుడు తన కారుతో అక్కడ స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కారు అక్కడున్న ఇసుకలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో అలలతాకిడికి ఆ కారు నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఎలాగోలా కారులోంచి బయటపడిన ఆ యువకుడు కారును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.
స్టంట్ చేసిన యువకుడి అరెస్ట్
దీంతో వెంటనే క్రేన్ సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న క్రేన్ నీటిలో చిక్కుకుపోయిన అతని బెంజ్ కారును బయటకు తీసుకొచ్చింది. దీంతో ఆ యువకుడు హ్యాపీగా ఫీలయ్యాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీచ్ లో మెర్సిడెస్ కారుతో స్టంట్స్ చేసినందుకు ఆ యువకుడిని అరెస్టు చేశారు. నిషేధిత ప్రాంతంలోకి కారు నడిపినందుకు పోలీసులు BNS సెక్షన్ 281 ,మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184, 177 కింద ఘటనపై కేసు నమోదు చేశారు.
బీచ్ భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
సూరత్‌లోని బీచ్ వెంబడి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి ఏం కాదు. గతంలో కూడా ఇలా చాలా సంఘటనలు వెలుగు చూశాయి. అయినా కూడా ప్రజల్లో ఏమాత్రం మార్పు రావట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా నిబంధనలు ఉల్లఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా బీచ్‌కు వచ్చే పర్యాటకు భయాందోళనకు గురవుతున్నట్టు తెలిపారు.
వీడియో చూడండి..
#Crane pulls out #Mercedes car stuck at #Dumas Beach in #Surat 🙆♂️ pic.twitter.com/lIBeq3MIlx
— Omkara (@OmkaraRoots) October 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
