AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిలో మునిగి.. మరణ ఉచ్చులో చిక్కుకున్న చిరుతకు ప్రాణభిక్ష పెట్టిన సైనికులు..!

మానవత్వం, కరుణను తెలియజేసే.. హృదయాలను హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గాయపడిన చిరుతపులి నది మధ్యలో చిక్కుకుపోయింది. భారీగా నీటి ప్రవాహం, అలసట కారణంగా చిరుతపులి తనను తాను నియంత్రించుకోలేకపోయింది. కానీ, కొంతమంది వన్యప్రాణుల అధికారులు, రెస్క్యూ టీం సభ్యులు తమ ప్రాణాలనే పణ్ణంగా పెట్టారు.

నీటిలో మునిగి.. మరణ ఉచ్చులో చిక్కుకున్న చిరుతకు ప్రాణభిక్ష పెట్టిన సైనికులు..!
Saved Leopard
Balaraju Goud
|

Updated on: Oct 29, 2025 | 10:39 PM

Share

మానవత్వం, కరుణను తెలియజేసే.. ఒక హృదయాలను హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గాయపడిన చిరుతపులి నది మధ్యలో చిక్కుకుపోయింది. బలమైన ప్రవాహం, అలసట కారణంగా చిరుతపులి తనను తాను నియంత్రించుకోలేకపోయింది. కానీ, కొంతమంది వన్యప్రాణుల అధికారులు, రెస్క్యూ టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని, తమ ప్రాణాలను పణంగా పెట్టి, నిస్సహాయ జంతువును రక్షించారు. ఈ వీడియో అందర్నీ కదిలించింది. సైనికులు ఈ భయంకరమైన జంతువును రక్షించిన విధానం ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోలో చిరుతపులి సగం నీటిలో మునిగిపోయి కనిపించింది. పడవ అంచును పట్టుకుని, మునిగిపోకుండా తనను తాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దాని కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు, ఒక అధికారి నెమ్మదిగా దగ్గరకు వచ్చి, దానికి ఎటువంటి హాని చేయమని హామీ ఇచ్చాడు. మరుసటి క్షణం, ఆ అధికారి చిరుతపులి తలను సున్నితంగా తాకుతూ, “భయపడకు, మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము” అని చెబుతున్నట్లుగా తల నిమిరారు. ఈ క్షణం ఎంతో భావోద్వేగాన్ని తెలియజేసింది. ఇది చూసే ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది.

అప్పుడు రెస్క్యూ టీం నెమ్మదిగా చిరుతను పడవలోకి లాక్కున్నారు. అలసిపోయి గాయపడినప్పటికీ, చిరుతపులి జట్టుపై దాడి చేయలేదు. బదులుగా వారి మాటలను నమ్మింది. బృంద సభ్యులు దానిని జాగ్రత్తగా తాడుతో లాగి, పడవకు కట్టి, తమతో తీసుకెళ్లారు. చిరుతపులి పడవ దగ్గరకు రాగానే, అది సురక్షితంగా ఉందని గ్రహించినట్లుగా నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను @AMAZlNGNATURE ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది వైరల్‌గా మారింది.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..