Venomous Snake: పడక గదిలో శబ్ధం.. తలుపు తీస్తే.. రెండు మీటర్ల పొడువైన కోబ్రా.. వాళ్లు ఏం చేశారంటే?
Snake in Bed Room: రాత్రి అయింది.. ఆ కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయేందుకు రేడి అవుతున్నారు. ఇంతలోనే
Snake in Bed Room: రాత్రి అయింది.. ఆ కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయేందుకు రేడి అవుతున్నారు. ఇంతలోనే పడక గది నుంచి బుస్.. బుస్.. మంటూ శబ్ధం వస్తోంది. తీరా ఏమిటా అని పడకగదిని పరిశీలించగా.. రెండు మీటర్ల పొడువైన భారీ కోబ్రా పాము (త్రాచు పాము) కంటపడింది. దీంతో ఆ కుటుంబ సభ్యులందరూ గజగజ వణికిపోయారు. వెంటనే తలుపులను మూసివేసి నిద్రపోకుండా పాముకు కాపాలకాస్తూ కూర్చున్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ఎరయూర్ పిరింగల్‌తోడిలో జరిగింది.
పిరింగల్ తోడిలోని మణికందన్ కుటుంబ సభ్యులు నిద్రపోయేందుకు పడక గదిలోకి వెళ్లగా.. చాప కింద పడుకున్న రెండు మీటర్ల పొడవైన కోబ్రా పాము బుస కొట్టిందని తెలిపారు. ఏమి చేయాలో పాలుపోక.. భయంతో కుటుంబమంతా రాత్రివేళ ఇంటి బయటే ఉండిపోయిందని మణికందన్ తెలిపాడు. ఉదయాన్నే పొరుగువారికి సమాచారం ఇవ్వగా.. వారు పాములు పట్టే వ్యక్తికి సమాచారమిచ్చారు. పాములను పట్టే వ్యక్తి ఉదయాన్నే మణికందన్ ఇంటికి చేరుకోని పామును పట్టుకున్నాడు. దీంతో మణికందన్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
అయితే వేసవి కాలం కావున.. బయట వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తాయి. ఈ క్రమంలో ఇంటికి కిటికీలు, తలుపులు తెరిచి ఉండటంతో విష సర్ఫాలు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పాములు పట్టే వ్యక్తి అబ్బాస్ తెలిపాడు. కావున గ్రామీణ ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు.
Also Read: చాక్లెట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు.. మహిళలకు ఎందుకంత ఇష్టమో తెలుసా..?
జబర్ధస్త్ షూటింగ్ సెట్లో టీమ్ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..