Viral: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడికి ఫ్యూజులౌట్.. వధువు చేసిన పనికి అంతా షాక్!
ఈ మధ్యకాలంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఫోటోగ్రాఫర్ పెళ్లిలో లేకుంటే.. ఆ మ్యారేజ్ ఎలా ఉంటది చెప్పండి.. అందుకేనేమో..
సాధారణంగా పెళ్ళిళ్ళలో ఫోటోగ్రాఫర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ప్రతీ ఒక్క అందమైన మూమెంట్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు వాళ్లు ఎంతో కష్టపడతారు. అలాగే వధూవరులు ఇద్దరూ కూడా తమ వివాహానికి సంబంధించిన ప్రతీ క్షణాన్ని క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్స్ బాగా ఫేమస్ అయ్యాయి. మరి అంతటి మెయిన్ రోల్ పోషించే ఫోటోగ్రాఫర్ పెళ్లిలో లేకుంటే.. ఆ మ్యారేజ్ ఎలా ఉంటది చెప్పండి.. అందుకేనేమో ఈ వధువు అలాంటి నిర్ణయం తీసుకుంది. పెళ్ళికొచ్చిన వారందరూ షాక్ అయ్యేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ దేహత్‌లోని మంగళ్‌పూర్‌కు చెందిన ఓ రైతు కూతురికి.. భోగ్నిపూర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి వివాహానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సరిగ్గా వధూవరులు ఇద్దరూ పూలదండలు మార్చుకునే సమయానికి.. అందరికీ షాక్ కలిగేలా వధువు ఓ నిర్ణయం తీసుకుంది. తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది.. సరాసరి పెళ్లి వేడుక నుంచి తన ఇంటికి వెళ్లింది. దానికి కారణం లేకపోలేదు. పెళ్లిలో ఎక్కడా ఫోటోగ్రాఫర్ కనిపించకపోవడమే.. వధువు ఆ వేడుక నుంచి బయటికి రావడం జరిగిందని తెలుస్తోంది.
అందరూ ఆ అమ్మాయిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆమె “ఈ రోజు పెళ్లి గురించి పట్టించుకోని వ్యక్తి.. భవిష్యత్తులో నన్ను ఎలా చూసుకుంటాడు?” అని చెప్పిందట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారట.. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత, విషయం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది, అక్కడ పెద్దల పరస్పర అంగీకారంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు డబ్బు, విలువైన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. చివరికి గొడవ కాస్తా సద్దుమణిగింది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌లు వివాహ వేడుకలో లేకపోవడం వల్లే వధువు కోపం తెచ్చుకుని వెళ్ళిపోయిందని.. ఆమె అందుకే పెళ్లికి నిరాకరించిందని మంగళ్‌పూర్ ఎస్‌ఐ తెలిపారు. చివరికి ఇరు వర్గాల వారు పరస్పర అంగీకారానికి రావడంతో గొడవకి ముగింపు పలికామన్నారు.