Andhra Pradesh: ఇసుక ర్యాంపులో ఒక్కసారిగా అలజడి.. బెంబేలెత్తిపోయి జనం పరుగో పరుగు.!
ఇసుక ర్యాంపుల్లో రాత్రయితే చాలు కొంతమంది అక్రమ రవాణాదారులు ఇసుకను తరలించాలని చూస్తుంటారు...
ఇసుక ర్యాంపులు రద్దీగా ఉంటాయి. అక్కడ పనిచేసే సిబ్బంది.. లారీలు, ట్రాక్టర్లలోకి ఇసుకను లోడ్ చేస్తూ బిజీబిజీగా ఉంటుంటారు. ఇసుక ర్యాంపుల్లో రాత్రయితే చాలు కొంతమంది అక్రమ రవాణాదారులు ఇసుకను తరలించాలని చూస్తుంటారు. అలాంటివి జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక ర్యాంపులు హడావుడిగా ఉంటాయి. మరి అలాంటి ఓ ఇసుక ర్యాంపులో ఒక్కసారిగా అలజడి రేగింది. జనం బెంబేలెత్తిపోయి పరుగులు పెట్టారు. ఆ వివరాలు ఇలా..
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో భారీ కొండచిలువ స్థానికంగా భయందోళనలు సృష్టించింది. కొండచిలువను చూసిన అక్కడి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు పెట్టారు. ఆ కొండచిలువను ఎలాగైనా చంపేయాలని కర్రలు పట్టుకున్నారు. అయితే ఇద్దరు యువకులు వారిని చంపొద్దని వారించి.. ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని గోనె సంచిలో బంధించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు.