SBI Loan: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్.. ఇంటి నుంచే అప్లయ్ చేసుకోండిలా!

State Bank Of India: అర్హులైన కస్టమర్లకు డిజిటల్ పద్దతిలో డాక్యుమెంటేషన్ పూర్తయి క్షణాల్లో రూ. 35 లక్షల వరకు వ్యక్తిగత లోన్ మంజూరు అవుతుంది...

SBI Loan: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్.. ఇంటి నుంచే అప్లయ్ చేసుకోండిలా!
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2022 | 12:11 PM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. యోనో(Yono App) యాప్ ద్వారా ‘రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్యాంకు సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర నుంచే పర్సనల్ లోన్‌ను పొందొచ్చు. వ్యక్తిగత రుణం కోసం రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ తీసుకోవాలనుకునేవారు యోనో యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అర్హులైన కస్టమర్లకు డిజిటల్ పద్దతిలో డాక్యుమెంటేషన్ పూర్తయి క్షణాల్లో రూ. 35 లక్షల వరకు వ్యక్తిగత లోన్ మంజూరు అవుతుంది. ఖాతాదారులకు సౌలభ్యాన్ని అందించడంతో పాటు వారికి డిజిటల్‌గా సాధికారత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ‘రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌'(RTXC) గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ వ్యక్తులు ప్రయోజనాన్ని పొందగలరు..

రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో పనిచేసే వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరని బ్యాంక్ తెలిపింది. ఇకపై వారు వ్యక్తిగత రుణం కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్రెడిట్ హిస్టరీ, అర్హత, డాక్యుమెంటేషన్ మొత్తం రియల్ టైమ్‌లో డిజిటల్‌ పద్దతిలో పూర్తవుతుందని SBI తెలిపింది. అలాగే ఈ లోన్ వడ్డీ రేట్లు తక్కువని వెల్లడించింది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ) వడ్డీ రేటును 40 నుండి 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఇక పెరిగిన వడ్డీ రేట్లు మే 10వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే.

రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అప్లయ్ చేసుకోండిలా..

  • మొదటిగా యోనో యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
  • మీ పూర్తి వివరాలను రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్ అవ్వండి.
  • ఇక లాగిన్ అనంతరం లోన్ ఆప్షన్స్‌లో రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌పై క్లిక్ చేయండి.
  • సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి.. లోన్ వివరాలు, టెన్యూర్‌ను ఎంటర్ చేయండి.
  • సబ్మిట్ నొక్కిన తర్వాత.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. డబ్బులు ఖాతాలోకి క్రెడిట్ అవుతాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?