బాబోయ్‌..100 కిలోల బరువుతో బహుబలి బర్గర్‌.. 200 వందల మంది స్కూల్‌ పిల్లలకు ప్రత్యేకంగా..

100 కిలోల బర్గర్ తయారీ కోసం మయోనైజ్, దోసకాయ, టొమాటో ముక్కలను మూడవ పొరపై, అంటే మూడవ బన్నుపై ఉంచి, పైన టొమాటో సాస్ కలుపుతారు. తర్వాత నాలుగో, ఐదో లేయర్‌లను తయారు చేసి జున్నుతో అలంకరించి మళ్లీ పైన ఆలూ టిక్కీతో ఇలా ఐదు పొరలుగా చేసి 100 కిలోల బర్గర్‌ను తయారు చేస్తారు. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి..

బాబోయ్‌..100 కిలోల బరువుతో బహుబలి బర్గర్‌.. 200 వందల మంది స్కూల్‌ పిల్లలకు ప్రత్యేకంగా..
Hundred Kg Burger
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2023 | 8:26 AM

మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్లు, ఫ్రైస్ తినడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. రకరకాల బర్గర్లు, మాంసాహారం వెరైటీలు వీరి ఫేమస్‌.. అయితే, మీరు ఎప్పుడైనా 100 కిలోల బర్గర్‌ని చూశారా? ఖచ్చితంగా లేదనే చెబుతారు.. కానీ, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చెఫ్, అతని సిబ్బందితో కలిసి ఇలాంటి బర్గర్‌ను ప్రత్యేకమైన రీతిలో తయారు చేశారు. ఆ బర్గర్‌ బరువు అక్షరాల100 కిలోలు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

100 కిలోల బర్గర్‌ను ఆగ్రాలోని కొంతమంది చెఫ్‌లు,వారి సహచరులు కలిసి తయారు చేశారు. మొదట టేబుల్ మీద ఒక ప్లేట్‌పై పెద్ద బన్ను పెట్టారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ (వేయించిన బంగాళాదుంప ముక్కలు) తో ఒక లేయర్‌గా వేశారు. ఆ తర్వాత దానిపై సాస్, కొన్ని మసాలాలు కలుపుతారు. పాలకూర ఆకుకూరలు వేసి, ఆపై బన్స్ కర్రలతో వడ్డిస్తారు. తరువాత, ఈ కర్రల సహాయంతో మరొక బన్ను తయారు చేసి ఆపై మరో లేయర్‌గా తయారు చేశారు. అలాగే ఈ రెండవ బన్నుపై ఆలూ టిక్కీలు వేశారు. సాస్ కూడా వేశారు. దానిపై మూడవ బన్ను కూడా పెట్టారు. ఇలా పొరలు పొరలుగా100 కిలోల బర్గర్ ఎలా తయారు చేస్తారు ఒక్కసారి వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

100 కిలోల బర్గర్ తయారీ..

అలాగే, మయోన్నైస్, దోసకాయ, టొమాటో ముక్కలను మూడవ పొరపై, అంటే మూడవ బన్నుపై ఉంచి, పైన టొమాటో సాస్ కలుపుతారు. తర్వాత నాలుగో, ఐదో లేయర్‌లను తయారు చేసి జున్నుతో అలంకరించి మళ్లీ పైన ఆలూ టిక్కీతో ఇలా ఐదు పొరలుగా చేసి 100 కిలోల బర్గర్‌ను తయారు చేస్తారు. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఈ వీడియో Instagram ఖాతా @tasteoftravel నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. ఈ వినియోగదారు పేరు హిమాన్షు, వీడియో సృష్టికర్త. అలాగే, అతను ఆగ్రాలో ఉన్న ఈ ప్రత్యేకమైన 100 కిలోల బర్గర్‌ను వీడియోను తయారు చేశాడు. ఇక వైరల్‌ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ పెడుతున్నారు. ఆహారం వృధా అయిందని కొందరు వీడియో చూసి చెబుతున్నారు. అయితే, ఈ 100 కిలోల బర్గర్‌లను ఒక స్కూల్‌లని 200 మంది విద్యార్థులకు పంపిణీ చేసినట్లు వినియోగదారు కామెంట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…