కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్ !! చివరికి ??
మద్యం మత్తులో ఉన్న ఒక తాగుబోతు పాముతో ఆటలాడాడు. తాను శివుడి తండ్రినంటూ ఆ పామును మెడలో వేసుకున్నాడు. తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. చివరకు ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా అహిరౌలి గ్రామానికి చెందిన 23 ఏళ్ల రోహిత్ జైస్వాల్ చేతిలో పామును పట్టుకుని ఆటలాడాడు. తాను మహాకాల్ తండ్రినని, తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు.
మద్యం మత్తులో ఉన్న ఒక తాగుబోతు పాముతో ఆటలాడాడు. తాను శివుడి తండ్రినంటూ ఆ పామును మెడలో వేసుకున్నాడు. తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. చివరకు ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా అహిరౌలి గ్రామానికి చెందిన 23 ఏళ్ల రోహిత్ జైస్వాల్ చేతిలో పామును పట్టుకుని ఆటలాడాడు. తాను మహాకాల్ తండ్రినని, తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. పామును మెడలో వేసుకోవడంతో పాటు చేతికి చుట్టుకున్నాడు. సిగరెట్ స్మోక్ చేసిన అతడు ఆ పాముతో నాలుకపై కాటు వేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో విషపూరితమైన ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్ జైస్వాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos